ఇద్దరి అమ్మాయిలను సముద్రంలోకి లాగేసిన అలలు.. తర్వాత ఏమైందో చూడండి..

సముద్ర తీరం వద్ద నిల్చోని, అలలను చూస్తూ ఎంజాయ్ చేయాలని, ఆ వాతావరణం ఆస్వాదించాలని చాలామంది అనుకుంటారు.అందుకే బీచ్‌ల వద్ద ఎక్కువమంది జనాలు కనిపిస్తుంటారు.

అయితే ఒక్కోసారి ఈ సముద్రపు అలలు ఆ సందర్శకులను లోపలికి లాగేసుకుంటాయి.ఇలాంటి సందర్భాల్లో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఇటీవల ఇద్దరు అమ్మాయిలను కూడా ఒక పెద్ద అల లాక్కెళ్ళింది.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు సముద్రం తీరాన ఆడుకుంటూ ఉన్నారు.అయితే, అకస్మాత్తుగా వచ్చిన భారీ అలలు వారిని లాక్కొనిపోయాయి.

Advertisement

ఈ అమ్మాయిలు 15-20 సెకన్ల పాటు చాలా భయపడిపోయారు.మళ్లీ అలలు వారిని తీరానికి దగ్గరగా ఉన్న మెట్లకు వద్దకు తీసుకెళ్లి వదిలేశాయి.దగ్గరలో ఉన్న వాళ్లు వారిని కాపాడాలని ప్రయత్నించారు కానీ ఏమీ చేయలేకపోయారు.

మళ్లీ అలలు వారిని సముద్రం లోపలికి లాగేసుకున్నాయి.ఇలా రిపీట్ అవుతూనే కనిపించింది వారి ప్రాణాలు నిలుస్తాయా లేదా చాలామందికి ఆందోళన కూడా కలిగింది.

చివరకు ఇద్దరు మనుషులు ధైర్యంగా సముద్ర తీరంలో వస్తున్న అలల లోకి దూకి ఆ అమ్మాయిలను కాపాడారు.ఈ ఘటన చూసిన వాళ్ళంతా చాలా భయపడిపోయారు.

ఈ వీడియోను 6 లక్షల మందికి పైగా చూశారు.చాలామంది ఈ అమ్మాయిలను తప్పు పడుతున్నారు.వారికి ఎలా ప్రమాదం నుంచి బయటపడాలో కూడా తెలియలేదని, వెంటనే అక్కడి నుండి కదల లేక చోద్యం చూస్తున్నారు అని కొందరు విమర్శించారు.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?
ఆర్టీసీ కార్గో పార్శిల్ మిస్సింగ్.. టెన్షన్ పడుతున్న అధికారులు.. ఎందుకంటే?

కొంతమంది ఈ సంఘటనను చూసి "ప్రకృతి ఎప్పుడూ గెలుస్తుంది" అని కామెంట్ చేస్తున్నారు.మరికొందరు ఆ అమ్మాయిలకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు.సముద్రం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి నిరూపిస్తుందని అంటున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల 36 వేల మంది నీట మునిగి మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

తాజా వార్తలు