వీడియో వైరల్: ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొన్న ఎక్స్ ప్రెస్ ట్రైన్..

పశ్చిమబెంగాల్( West Bengal ) లో నేడు ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ దారుణ సంఘటనలో కాంచన జంగా ఎక్స్ ప్రెస్ రైలు( Janga Express Train ) వేగంగా వచ్చి గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.న్యూ జల్పాయి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదు మంది మృతిచెందగా., చాలామంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం.

ఇంకా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Advertisement

కాంచనజంగా రైలు ఏకంగా గూడ్స్ రైలు మీదకి ఎక్కడంతో అనేక ప్రాణాలను బలికొనింది.ఈ ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగాలు అక్కడ సహాయలను మొదలుపెట్టాయి.అస్సాం లోని సిల్చార్ నుంచి కోల్ కతా( Kol Kata ) లోని సెల్దా వరకు వెళ్లే కాంచన్ జంఘా ఎక్స్ ప్రెస్ మధ్యలో న్యూజల్ పాయి గుడి వద్ద ఆగింది.

ఇక అక్కడి నుంచి బయలు దేరిన కొద్దీ కాసేటికే రంగపాని స్టేషన్ వద్ద వెనుక నుంచి ఓ గూడ్స్ రైలును ఎక్స్ ప్రెస్ బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో రైలు ఏకంగా ఒకవైపు ఎక్కేసింది.ఈ ఘటనలో రైలులోని ప్రయాణికులు చాలా మంది గాయపడినట్లు సమాచారం.ఇకపోతే రైలు అధికారులు అక్కడికి చాలా సమయం గడిచినా కానీ రాలేదని ప్రయాణికులు వాపోతున్నారు.

సంఘటన స్థలానికి రెస్య్కూ సిబ్బందితో పాటు, పోలీసుల సిబ్బంది ఘటన స్థలానికి ఆలస్యంగా వచ్చారంటూ రైలులోని ప్రయాణికులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..
Advertisement

తాజా వార్తలు