ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ వాడిన బుల్లెట్ బండి అసలు కథ ఏమిటంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం" ఆర్ఆర్ఆర్".

ఈ సినిమాలో ప్రముఖ నటులు రామ్ చరణ్ తేజ్ ,ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లను చిత్ర బృందం విడుదల చేసింది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే.ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గుర్రం మీద కనిపించగా ఎన్టీఆర్ బుల్లెట్ పై మనకు కనిపిస్తారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బుల్లెట్ బండికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది.అదేమిటంటే.

Advertisement
The Story Of The Real Bullet Used By Ntr In Rrr, Rrr, Bulle Bike, Ntr,ram Charan

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ సినిమా కావడంతో ఈ సినిమాలో ఉపయోగించే బుల్లెట్ కూడా ఆ కాలం నాటి కి సంబంధించినది ఉండాలని ప్రత్యేకంగా చిత్రబృందం ఈ బండిని తయారు చేశారు.

The Story Of The Real Bullet Used By Ntr In Rrr, Rrr, Bulle Bike, Ntr,ram Charan

అప్పటి కాలానికి చెందిన ఈ బుల్లెట్ బండి వెలాసిటీ మ్యాక్ 350 సీసీ.మోటార్ సైకిల్.అయితే ఈ బండిలో కేవలం ఒక మ‌నిషి మాత్ర‌మే కూర్చుని నడపాల్సి ఉంటుంది.

ఈ విధంగానే ఈ బండిని చిత్రబృందం డిజైన్ చేశారు.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తాజాగా చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది.

ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు.అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడితో పాటు ఎన్టీఆర్ జోడీగా న‌టిస్తున్న హాలీవుడ్ తార ఒలివియా మోరిస్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సుమారు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు