టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.నటుడు అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకుని అల్లు అరవింద్ నిర్మాతగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.
ఇక అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఇక వీరిలో అల్లు శిరీష్ పెద్దగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు.
అల్లు అర్జున్ మాత్రం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లో కూడా ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.ఈ విధంగా అల్లు అరవింద్ వారసులుగా వీరిద్దరు మనకి పరిచయం ఉన్నప్పటికీ అల్లు వెంకట్ అలియాస్ బాబి గురించి పెద్దగా చాలా మందికి పరిచయం ఉండకపోవచ్చు.
ఈయన హీరోగా తెరపై సందడి చేయలేకపోయినా తెర వెనుక పలు చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగా కొనసాగుతున్నారు.ఇక ఈయన నిర్మాతగా వ్యవహరిస్తున్న గని చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న అల్లు బాబీ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.
అల్లు వారసులుగా ప్రస్తుతం అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.వీరి మాదిరిగానే అల్లు బాబీకి కూడా సినిమాలలో నటించే అవకాశం వచ్చిందని ఆయన వెల్లడించారు.అయితే తనకు వచ్చిన అవకాశాలను ఎంతో సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
అయితే ఈయనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఇండస్ట్రీలో మంచి నటుడిగా స్థిరపడే అవకాశాలు ఉన్నప్పటికీ ఈయన సినిమాలలో నటించకపోవడానికి కారణాలను కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు ఒక్కసారి మంచి ఇమేజ్ ఏర్పడిన తర్వాత వారికి బయట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది.కానీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయానికి వస్తే వారికి చాలా తక్కువ ప్రైవసీ ఉంటుంది.స్వేచ్ఛగా వాళ్లెవరు బయట తిరగలేరు.
కానీ నేను మాత్రం నాకు ఇష్టమైనప్పుడు బయటకు వెళ్లి నాకిష్టమైన పనులను చేసుకోగలుగుతాను.నాకు స్వేచ్ఛగా బ్రతకడం చాలా ఇష్టం.
హీరోగా మారితే అలాంటి స్వేచ్ఛ పూర్తిగా కరువైపోతుంది.అందుకే అవకాశాలు వచ్చిన సినిమాల్లో నటించడం లేదని ఈ సందర్భంగా అల్లు బాబి తెలియజేశారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy