రైలు ప్రయాణంలో నెలసరి సమస్య, శానిటరీ ఫ్యాడ్లు లేక యువతి ఇబ్బంది.. ఇండియన్‌ రైల్వేకు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే

ఆడవారి నెల సరి సమస్య ఎప్పుడు వచ్చేది సరైన సమయం తెలియదు.

ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు లేదంటే, ఏదైనా కార్యక్రమంలో ఉన్నప్పుడు వారు అనుభవించే బాధ అంతా ఇంతా కాదు.

ప్రయాణ సమయంలో నెలసరి వల్ల విపరీతమైన కడుపు నొప్పి లేవడంతో పాటు, తీవ్ర ఇబ్బంది పడ్డ ఒక యువతికి ఇండిన్‌ రైల్వే చేసిన సేవ మరిచి పోలేనిది.ఇండియన్‌ రైల్వే స్పందించిన తీరుకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.

ఇండియన్‌ రైల్వే చాలా మంచి సర్సీస్‌ను అందిస్తుందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.బెంగళూరు నుండి బళ్లారికి ఒక యువతి తన స్నేహితుడితో కలిసి రైలులో ప్రయాణం చేస్తుంది.కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆమెకు నెలసరి వచ్చింది.

Advertisement

ఆ సమయంలో ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధ పడటంతో పాటు, ఎటు వెళ్లలేని పరిస్థితి.దాంతో ఆమె స్నేహితుడు ఏం చేయాలో తోచక రైల్వే సిబ్బంది సాయం తీసుకోవాలనుకున్నాడు.

అప్పటికే అతడికి తెలిసిన ఇండియన్‌ రైల్వే సేవ యాప్‌ ను ఓపెన్‌ చేశాడు.అందులో రైల్వే మంత్రిత్వ శాఖకు తన స్నేహితురాలు పడుతున్న ఇబ్బంది గురించి వివరించి, తాము ఉన్న కంపార్ట్‌మెంట్‌ వివరాలను నమోదు చేశాడు.

ఆ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చిన ఆరు నిమిషాల్లోనే రైల్వే అధికారులు అక్కడకు చేరుకుని పూర్తి వివరాలు తెలుసుకుని, ముందు రాబోతున్న స్టేషన్‌లోని స్టేషన్‌ మాస్టర్‌తో మాట్లాడి శానిటరీ నాప్కిన్స్‌ మరియు ట్యాబ్లెట్లను ఏర్పాటు చేయమన్నారు.అర్థ గంటలో ఆమెకు అవి అందాయి.విషయం తెలుసుకున్న రైలు ప్రయాణికులతో పాటు, అంతా రైల్వే శాఖపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇండియన్‌ రైల్వే సేవ మొబైల్‌ యాప్‌ చాలా ఉపయోగదాయకమైనది.దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.రైలు ప్రయాణంలో ఉన్న సమయంలో దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు, ఏదైనా సాయం పొందవచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఈ యాప్‌ గురించి మీ స్నేహితులకు తెలియజేసేందుకు ఈ విషయాన్ని షేర్‌ చేయండి.

Advertisement

తాజా వార్తలు