ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మహిళను మింగిన కొండ చిలువ!

పాముల్లో అతి భయంకరమైనది అనకొండలు, కొండ చిలువలు.ఈ పాములు విషపూరితమైనవి కావు.

కానీ మాంసాహారులు.జంతువులను వేటాడి చంపుతాయి.

The Python That Swallowed The Woman , Python, Anaconda, Snake, Zara, Social Med

చిన్న చిన్న జంతువులతో పాటు పెద్ద పెద్ద అడవి జంతువులను సైతం ఎంతో ఈజీగా మింగేస్తుంటాయి.కొన్ని సందర్భాల్లో మనుషులను కూడా మింగేస్తుంటాయి.

మీలో చాలా మంది బాలీవుడ్ సినిమా అయినా.అనకొండ సీరిస్‌లు చూసి ఉండే ఉంటారు.

Advertisement

ఈ సినిమా ఎంత హిట్ అయిందంటే ఇప్పటివరకు 5 పార్టుల్లో సినిమా విడుదలైంది.ఈ సినిమాల్లో పాములు మనుషులను వేటాడుతూ చంపుతాయి.

అనంతరం మనుషులను మింగేస్తుంటాయి.నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా రేర్.

తాజాగా ఇండోనేషియాలో ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇండోనేషియాలోని జాంబి ప్రావిన్స్‌ కు చెందిన జారా (54 ఏళ్లు) అనే మహిళను కొండ చిలువ మింగింది.

ఇటీవల అడవికి రబ్బర్ తేవడానికి వెళ్లిన జారా చీకటి పడినా ఇంటికి తిరిగి రాలేదు.దీంతో ఊరి జనమంతా ఆమెను వెతుకుతూ అడవిలోకి వెళ్లారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!

ఈ క్రమంలో వాళ్లకు 22 అడుగుల భారీ కొండ చిలువ కనిపించింది.కొండచిలువ కదలలేని స్థితిలో ఉంది.

Advertisement

కడుపులో పెద్ద జీవి ఉన్నట్లు గ్రహించారు.దీంతో గ్రామస్తులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు.

పామును పట్టుకున్న గ్రామస్తులు చివరకు చంపేశారు.అనంతరం పాము పొట్టను కోసి చూశారు.

దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.కొండ చిలువ పొట్టలో జారా మృతదేహం బయటపడింది.

దీంతో ఆ ప్రాంతంలో అలజడి మొదలైంది.అయితే జాంబి ప్రావిన్స్ లో ఇంతకంటే పెద్ద పాములు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

జారా మృతిపై భయాందోళనకు గురవుతున్నారు.కాగా, దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు