అయ్యయ్యో.. కొత్త కారుకి పూజ చేసిన ఓనర్.. కానీ వెంటనే అదుపుతప్పి..

ఎవరైనా సరే కొత్త వాహనం కొంటే షోరూం నుండి బయటకు తీసుకువస్తే నేరుగా దేవాలయాలకు వెళ్లి వాటికి పూజ చేసేవారు చాలామంది ఉన్నారు.

ఇందులో భాగంగానే తాజాగా ఓ వ్యక్తి కొత్త కారు( New car ) కొని గుడిలో పూజలు నిర్వహించారు.

అయితే అనుకోని కారణం చేత అదుపుతప్పిన ఆ కారు ఆలయంలోని స్తంభాన్ని ఢీ కొట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.అయితే ఇక్కడ అదృశ్యం ఏమిటంటే.

కొత్త కారుకు పూజ చేసిన యజమాని మాత్రం సురక్షితంగా బయటపడడమే.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

Advertisement

సుధాకర్( Sudhakar ) అనే వ్యక్తి కొత్తగా ఓ కారును కొన్నాడు.శ్రీముష్ణం( Shrimushnam ) ప్రాంతంలోని ఓ ఆలయంలో కొత్త వాహనానికి పూజలు చేయించాడు.అయితే డ్రైవింగ్ సీట్ లో ఉన్న సుధాకర్ బయట ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో పూజలు నిర్వహించిన తర్వాత కారును నడిపేందుకు అతడు ప్రయత్నించాడు.

కాకపోతే ఆ సమయంలో బ్రేకులు వేయపోయి యాక్సిలెటర్ ను తొక్కడంతో కారు అదుపుతప్పి గుడిమెట్ల మీదుగా ముందుకు దూసుకెళ్లింది.ఆ సమయంలో కారును కంట్రోల్ చేసేందుకు ఓ వ్యక్తి తీవ్రంగా శ్రమించిన ఫలితం తగ్గలేదు.

దాంతో ఆలయం మరోవైపు ఉన్న ప్రాంగణంలోని స్తంభాన్ని కారు ఢీకొట్టింది.

ఈ హఠాత్పరిమాణంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.కారు యజమాని సుధాకర్ కు మాత్రం ఎలాంటి ప్రమాదానికి గురి అవ్వకుండా సురక్షితంగా బయటపడ్డాడు.అయితే ఈ సంఘటనతో కొత్త కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ల‌వ్ లో ఉండ‌గా... టెలిగ్రామ్ పంపిన అనుభూతి.! ఇప్ప‌టికీ ఆ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ యా ఆయ‌న న‌న్ను ఆట‌ప‌ట్టిస్తుంటారు.!

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేయబడుతున్నారు.మరోవైపు పూజ సమయంలో సిసిటీవీలో రికార్డు అయిన వీడియో క్లిప్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం సిసిటీవీలో రికార్డు అయిన వీడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

తాజా వార్తలు