సూట్‌కేస్‌లో మొసలిని చూసి అవాక్కయిన అధికారులు, ధర తెలిస్తే షాక్ అవుతారు!

సాధారణంగా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద చెకింగ్ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది.అక్కడ తనిఖీలు నిర్వహించే అధికారుల నుంచి కళ్ళుగప్పి చట్టవిరుద్ధమైన వస్తువులను స్మగ్లింగ్ చేయడం దాదాపు అసాధ్యం.

అయినా కూడా కొందరు వీరినుంచి ఎలాగోలా తప్పించుకుంటారు.కొందరు అత్యుత్సాహంతో, అతి నమ్మకంతో ఊహించని వస్తువులతో విమానాశ్రయాలకు వస్తుంటారు.

కాగా తాజాగా అలాంటి ఒక సంఘటన వెలుగుచూసింది.అమెరికా దేశానికి చెందిన ఒక స్మగ్లర్ ఒక సూట్‌కేస్‌ తనతోపాటు తీసుకొచ్చి విమానాశ్రయ అధికారులను ఉలిక్కి పడేలా చేశాడు.

వివరాల్లోకి వెళితే, ఇటీవల అమెరికాకు చెందిన 42 ఏళ్ల ఒక వ్యక్తి సింగపూర్ వెళ్లేందుకు జర్మనీలోని మ్యూనిచ్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాడు.అతడి చేతిలో ఒక భారీ సూట్‌కేస్‌ ఉండటం చూసి అధికారులు అనుమానించారు.

Advertisement

అదే సమయంలో ఆ వ్యక్తి విమానాశ్రయంలోని లగేజ్ స్కానర్ వద్ద తన సూట్‌కేస్‌ను పెట్టాడు.అప్పుడు అధికారులకు సూట్‌కేస్‌ లోపల నల్లగా ఏదో కనిపించింది.

దాంతో వారు ఆ సూట్‌కేస్ ఓపెన్ చేసి చూసి చూడగా అందులో ఒక మొసలి కనిపించింది.ఇది అన్ని మొసళ్లలా కాకుండా తెల్లగా ఉంది.దీని విలువ అక్షరాలా రూ.60 లక్షలు ఉంటుందని అంటున్నారు.

ఇంత ఖరీదు కాబట్టే దీనిని స్మగ్లింగ్ చేయడానికి అతను ప్రయత్నించాడు.కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి లాగా ఇతడు అడ్డంగా అధికారులకు బుక్కయి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.ఈ తెల్ల మొసలి ఒక మీటరు వరకు పొడవు ఉందని అధికారులు తెలిపారు.

ఈ క్రోకడైల్ చర్మాన్ని ఖరీదైన బ్యాగులు, సీట్ కవర్లు, మెత్తలు, ఇంకా వ్యవసాయరంగ పరికరాలు తయారు చేయడంలో ఉపయోగిస్తారని సమాచారం.

తన డ్రైవర్ పెళ్లికి హాజరై.. పెళ్ళికొడుకుని కారులో మండపానికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే (వీడియో)
Advertisement

తాజా వార్తలు