తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలల మాత్రమే సమయం ఉండడంతో, అధికార బీఆర్ఎస్ ( BRS )ను ఓడించేందుకు బిజెపి భారీగానే ప్లాన్ చేస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో బిజెపి ( BJP )గెలవాలనే పట్టుదలతో ఆ పార్టీ అధిష్టానంతో పాటు, రాష్ట్ర నాయకత్వం ఉంది .
ఇటీవల కాలంలో పార్టీ కాస్త వెనకబడినట్లుగా కనిపిస్తుండడంతో, భారీగానే తెలంగాణ బిజెపిలో ప్రక్షాళనను చేపట్టింది ఆ పార్టీ అధిష్టానం.తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్( Bandi Sanjay ) ను తప్పించి ఆస్థానంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని( Minister Kishan Reddy ) నియమించింది.
వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చే లోకి విధంగా వ్యూహాత్మక ఎత్తుగడలను అమలు చేస్తారని ఆ పార్టీ అధిష్టానం నమ్మకం పెట్టుకుంది.దీనికి తగ్గట్లుగానే కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ మేరకు బిఆర్ఎస్ ను ఓడించేందుకు వందరోజుల మాస్టర్ ప్లాన్ రూపొందించారు.
తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న స్థానిక సమస్యలను ప్రధానంగా టార్గెట్ చేసుకుని బిఆర్ఎస్ ను ఓడించాలనే పట్టుదలతో తెలంగాణ బిజెపి ఉంది.బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా ప్లాన్ లు వేస్తోంది తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా బిజెపికి మొత్తం 35 వేలకు పైగా బూత్ లు ఉన్నాయి.దాంట్లో ఇన్చార్జిలో నియామకం చేపట్టి, బూత్ ల వారీగా బిజెపి గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఇప్పటివరకు ఇన్చార్జిల నియామకం పూర్తి కాకపోవడంతో , వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నిర్ణయించుకున్నారు.ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.అలాగే జిల్లాల అధ్యక్షులను యాక్టివ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.
ఎక్కడికక్కడ స్థానిక సంస్థలను గుర్తించి, వాటిని హైలెట్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచే విధంగా బిజెపి శ్రేణులు దిశానిర్దేశం చేస్తున్నారు.తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చినా, వాటిని సక్రమంగా వినియోగించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని జనాలలోకి తీసుకెళ్లే విషయం పైన దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బిజెపి జెండా తెలంగాణలో రెపరెపలాడించేందుకు కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధిష్టానం పెద్దల సూచనలతో రంగంలోకి దిగారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy