అప్పుడప్పుడు సెలబ్రెటీలు చేసే పనులకు జనాలు మండిపడుతూ ఉంటారు.ఇక ఇప్పుడు సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండటంతో నేరుగా తిట్టేస్తున్నారు.
వాళ్లు షేర్ చేసిన పోస్ట్ నచ్చకపోతే చాలు.కొన్ని వేల మంది చూస్తారన్న విషయాన్ని కూడా పక్కకు పెట్టి సెలబ్రెటీలను బూతులు తిట్టేస్తుంటారు.
ఇక ఈమధ్య సెలబ్రెటీలు( Celebrities ) కూడా సైలెంట్ గా ఉండట్లేరు.వాళ్లు కూడా వెంటనే ఫైర్ అవుతూ వారిని మరోసారి నోరు తెరవకుండా కౌంటర్లు వేస్తున్నారు.
అయితే తాజాగా అరియానా( Ariana ) కూడా అదే పని చేసింది.యాంకర్ అరియానా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ రియాల్టీ షో ( Bigg Boss reality show )లో పాల్గొని బాగా రచ్చ రచ్చ చేసింది.మొదట్లో ఈమె యూట్యూబ్ యాంకర్ గా చేయగా ఆ తర్వాత బిగ్బాస్ లో అవకాశం అందుకుంది.
ఇక బిగ్ బాస్ లో అడుగు పెట్టి తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.ఇక షో తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.
సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది.అంతేకాకుండా బుల్లితెరపై కూడా పలు షోలలో అవకాశాలు అందుకుంది.
మొత్తానికి ఒక గుర్తింపుతో సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకొని అక్కడ కూడా బాగా రచ్చ చేసింది.
ఆ సమయంలో మరో బ్యూటీ అషు రెడ్డితో పరిచయం పెంచుకొని తనలాగా తయారయింది.
ఏకంగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తనలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టింది అరియానా.మొదట్లో కాస్త పద్ధతిగా ఉన్న ఈ బ్యూటీ రాను రాను అవకాశాల కోసం బాగా దిగజారిపోయిందని చెప్పాలి.ఎద అందాల నుండి థైస్ అందాల వరకు చూపిస్తూ బాగా రెచ్చిపోతూ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఆమె పోస్టులు షేర్ చేయని రోజులు లేవని చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఆమె బీబీ జోడీలో డాన్సర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.మామూలుగా ఈ బ్యూటీ కి డాన్స్ అంతగా రాదు.కానీ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఆ డాన్స్ షోలో బాగానే మార్కులు సంపాదించుకుంటుంది.
అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో కూడా పంచుకుంటూ ఉంటుంది.కొన్నిసార్లు ఈమెకు బాగా ట్రోల్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక డాన్స్ వీడియో షేర్ చేసుకుంది.దీంతో ఆ వీడియో చూసి నెటిజన్స్ కొందరు బాగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఇక ఓ నెటిజన్.
యాక్టింగ్ రాదు.డాన్స్ రాదు.
ఆ బిగ్ బాస్ పుణ్యమా అని దండం పెడుతూ కనిపించాడు.వెంటనే అరియానా అతనిని ట్యాగ్ చేసి.
ఒక పని చేయండి గురువుగారు.దయచేసి నాకు యాక్టింగ్, డాన్సింగ్ నేర్పించండి.
మీ పుణ్యాన కామెంట్ చేయడం ఎలాగో నేర్చుకున్నా అంటూ తిరిగి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.దీంతో వీరిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ చూసి మిగతా నెటిజెన్స్.
వాళ్ళ లైఫ్ గురించి మనకెందుకు బ్రో అంటూ అతగాడికి తిరిగి కామెంట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy