ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్... ధర తెలిస్తే గతుక్కుమంటారు!

ఈ ప్రపంచంలో మద్యం ప్రియులకు కరువు ఏముంది? బేసిగ్గా పురుషులు కళాపోషకులు కాబట్టి ఆమాత్రం వుంటుందని అంటారా? అయితే సరే.

కానీ అదే మధ్యం ధర మీ తలకు మించిన భారంగా మారితే కొనడం ఒకింత అసాధ్యమే కదా.

లేదు, మేము కొనగలము అని అంటారా? అయితే మీకు ఈ స్టోరీ చెప్పాల్సిందే.ఈ స్టోరీ విన్నాక మీరు అవాక్కవకూడదు మరి.ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం యాజియో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు.CEO అయిన తైవానీస్ బిలియనీర్ పియరీ చెన్( Pierre Chen ) తన గది నుండి 25,000 వైన్ బాటిళ్లను వేలం వేయగా అందులో కొన్ని బాటిల్స్ అదిరిపోయే ధరను పలికాయి.

The Most Expensive Wine In The World... If You Know The Price, Youll Know , Mo

దానికి కారణం అందులో కొన్ని అరుదైన బ్రాండ్ వైన్స్ ఉన్నాయి.ఒక్కొక్కటి $190,000 వరకు ధరను పలకనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇక అన్ని బాటిల్స్ మొత్తం $50 మిలియన్ల వరకు విక్రయించబడుతుందని అంచనా వేయబడింది.

ఐదు భాగాల విక్రయాన్ని నిర్వహిస్తున్న సోత్‌బైస్ ప్రకారం, ఈ వైన్‌లు వేలంలో అతిపెద్ద, అత్యంత ఖరీదైన వైన్ బాటిల్స్( Wine bottles ) వున్నాయి.ఇకపోతే సోత్‌బైస్( Sothebys ) ప్రపంచంలోని ప్రముఖ వేలం సంస్థల్లో ఒకటి.

Advertisement
The Most Expensive Wine In The World... If You Know The Price, You'll Know , Mo

బిలియనీర్ $15 మిలియన్ల విలువైన వైన్‌ను వేలం వేసిన ఐదేళ్లలోపు సోథెబీస్ ద్వారా కూడా వేలం జరిగింది.

The Most Expensive Wine In The World... If You Know The Price, Youll Know , Mo

అతను ప్రముఖ ఆర్ట్ కలెక్టర్, పాబ్లో పికాసో, గెర్హార్డ్ రిక్టర్, ఫ్రాన్సిస్ బేకన్‌తో సహా చిత్రకారుల రచనలను కూడా కలిగి వుండడం విశేషం.25,000 సీసాలు సోత్‌బైస్‌లో వచ్చే 12 నెలల్లో ఐదు ప్రత్యేక వేలంలో వేలం వేయబడతాయి.ఈ బిలియనీర్ గత 4 దశాబ్దాలుగా బాటిళ్లను సమీకరించినట్లు వేలం సంస్థ తెలిపింది.

ఒక వ్యక్తి తన జీవితకాలంలో తాగాలని ఆశించే దానికంటే ప్రస్తుతం అతని సెల్లార్‌లలో ఎక్కువ వైన్ నిలువ వుందని అతగాడు చెప్పుకొచ్చాడు.మొత్తం అతను ఇప్పుడు వేలం వేస్తున్న బాటిల్స్ రూ.415 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.ఇపుడు చెప్పండి అలాంటి మధ్యం తాగడం మన వశం అవుతుందా?.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..
Advertisement

తాజా వార్తలు