తిరుమలలో వేడుకగా ప్రారంభమైన శ్రీ పద్మావతీ పరిణయం

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మే స్వర్ణిమ మండపం లో మంగళవారం నాడు శ్రీ పద్మావతి పరిణయోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.

అందులో భాగంగా మొదటి రోజు వైశాఖశుద్ధ నవమిరోజైన మంగళవారం నాడు తిరుమలలో శ్రీవారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5 గంటలకు వేంచేపు చేసారు.అప్పటికే చక్కగా అలంకరించిన నారాయణగిరి ఉద్యానవనంలో వివిధ రకాల పల, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన స్వామి వారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి.

ఆ తరువాత శ్రీస్వామి వారికి కొలువు (ఆస్థానం) జరిగింది.ఈ కొలువులో సర్వజగత్ప్రభువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి వేదాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు మొదలైనవి నివేదించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య అధికారులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఓం నమో వేకటేశాయ.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 1, మంగళవారం 2024

తాజా వార్తలు