పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణిత.. పాప ఎంత అందంగా ఉందో!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి కన్నడ బ్యూటీ ప్రణీత గురించి అందరికీ పరిచయమే.తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

ఏం పిల్లో.ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో తన పాత్రకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఆ తర్వాత బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో కూడా నటించింది.

కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.ఈమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి మంచి సక్సెస్ లు అందుకుంది.

Advertisement

అంతేకాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.

బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.దీంతో ఆ సమయంలో తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.

తాను పెళ్లి చేసుకున్న విషయం అప్పుడు బయట పడింది.

ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఇక తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.గతంలో తను గర్భవతి అన్న విషయం కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Advertisement

పైగా తను తన బేబీ బంప్ తో ఫోటో షూట్ చేయించుకుని వాటిని కూడా సోషల్ మీడియాలో వదిలింది.ఆ మధ్యనే బాత్ టబ్ లో స్నానం చేస్తూ ఫోటో షూట్ చేయించుకుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.పైగా ఆ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

తన కూతురిని ఒడిలో పడుకోబెట్టుకున్న ఫోటో పంచుకుంటూ.పాప పుట్టినప్పటి నుంచి తనకు అంతా కలగానే అనిపిస్తుంది అని.తనకు గైనకాలజిస్ట్ అయినా తల్లి ఉండటం నిజంగా తన అదృష్టం అని తెలిపింది.కానీ మానసికంగా మాత్రం ఆమెకి ఇది చాలా కష్ట సమయం అని.డాక్టర్ సునీల్ ఈశ్వర్, అతడి టీమ్ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు అని తెలిపింది.అంతేకాకుండా డాక్టర్ సుబ్బు, అతడి బృందానికి కూడా కృతజ్ఞతలు తెలిపింది.

ఇక ఈ స్టోరీ మీకు చెప్ప కుండా ఉండలేక పోయాను అంటూ.వైద్యుల తో దిగిన ఫోటోలను పంచుకుంది.

కానీ పాప ముఖాన్ని మాత్రం చూపించకుండా జాగ్రత్త పడింది.

తాజా వార్తలు