అదనపు కట్నం అడిగిన వరుడు.. చెట్టుకు కట్టేసిన వధువు బంధువులు..!

పెళ్లి పీటలపై పెళ్లి ఆగడం అనేది ఎక్కువగా సినిమాలలోనే జరుగుతుంది.బయట ప్రపంచంలో ఎప్పుడో ఓసారి మాత్రమే పీటల మీద పెళ్లి ఆగిపోతుంది.

అయితే వరకట్నం తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరం అనేది అందరికీ తెలిసిందే.కానీ చాలామంది వరకట్నం లేకుండా పెళ్లి చేసుకోరని తెలిసిందే.

భారతదేశంలో( India ) కట్నం తీసుకోకపోయినా వరుడి కుటుంబానికి తగిన మర్యాదలతో పాటు వధువుకు కొంత బంగారం కచ్చితంగా తాహతకు తగ్గట్టుగా ఇస్తారు.అయితే ఓ వరుడు అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతాను లేదంటే కట్టను అని ముహూర్తానికి కొద్ది సమయం ముందు వధువు కుటుంబానికి డిమాండ్ చేస్తూ అడిగిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హారఖ్పూర్( Harakhpur in Uttar Pradesh ) గ్రామంలో చోటుచేసుకుంది.అసలు ఏమి జరిగిందో పూర్తి వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ లోని హారఖ్ పూర్ గ్రామంలో అమర్జిత్ వర్మ( Amarjit Verma ) అనే యువకుడికి పెళ్లి సంబంధం కుదిరింది.

Advertisement

పెళ్లికి తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కలిసి ఊరేగింపుగా వధువు గ్రామానికి వెళ్లాడు.వధువు తరుపు వారంతా వరుడికి ఘన స్వాగతం పలికాడు.

ఇక వీరి కుటుంబ ఆచారాల ప్రకారం వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి.మరికొద్ది క్షణాల్లో తాళి కట్టవలసి ఉండగా వరుడు అదనపు కట్నం( Additional dowry ) ఇవ్వాలంటూ వధువు తల్లిదండ్రులకు డిమాండ్ చేశాడు.దీంతో పెళ్లి మండపంలో ఉండే వధువు కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు.

వరుడుని, అతని కుటుంబీకులను ఎంత నచ్చజెప్పినా వారు కట్నం కోసం మొండిగా ప్రవర్తించడంతో.వధువు తరుపు బంధువులు వరుడుతోపాటు అతని కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వరుడుతో పాటు ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.

పోలీసులు ఇరు కుటుంబాల మధ్య ఉండే గొడవను పరిష్కరిస్తున్నారని సమాచారం.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు