పడిపోతున్న కుక్కను సినిమా స్టైల్లో కాపాడిన దేవత.. రియల్ హీరోయిన్ అంటే ఈమే!

బ్రెజిల్‌లో ఓ మహిళ (Brazil Woman )చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు.పైన ఫొటోలో చూస్తున్నారా, ఆమె చేతిలో ఉన్నది కార్డ్‌బోర్డ్ బాక్స్(Cardboard box).

దీంతోనే ఒక కుక్క(Dog) ప్రాణాలను కాపాడింది.ఈ డ్రామాటిక్ రెస్క్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే, ఒక భవంతి పై అంతస్తు కిటికీ నుంచి కుక్క వేలాడుతూ కనిపించింది.కిందపడిపోకుండా అది ప్రాణాల కోసం పోరాడుతోంది.

గుండెలు గుభేలుమనే ఆ సీన్ చూస్తుంటేనే భయమేస్తుంది.సరిగ్గా అదే సమయంలో అక్కడే నిల్చున్న ఆ మహిళ మెరుపులా కదిలింది.

Advertisement

ఆమె చేతిలో ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్(Cardboard box) ఉంది.కుక్క కింద పడిపోతుంటే.

ఆమె ఆ బాక్స్‌ను కరెక్ట్‌గా ప్లేస్‌లో పెట్టింది.దాంతో కుక్క క్షేమంగా బాక్స్‌లో పడింది.

ఊపిరి పీల్చుకున్న ఆ మహిళ.వెంటనే ఆ కుక్కను లోపలికి తీసుకెళ్లిపోయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఆ మహిళ తెలివితేటలకు, దయకు జేజేలు కొడుతున్నారు."నిజమైన హీరోలు కేప్ వేసుకోరు" అని ఒకరు కామెంట్ చేస్తే.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
ఆవాల‌తో మొటిమ‌లకు సులువుగా చెక్ పెట్టేయండిలా!

"అసలు డాగ్ సైజ్ బాక్స్ ఆమె దగ్గర రెడీగా ఉండటం గ్రేట్" అని ఇంకొకరు అంటున్నారు.అయితే, కొంతమందికి మాత్రం డౌట్ ఉంది."కుక్క బిల్డింగ్ ఎక్కుతూ అంత ప్రమాదకర పరిస్థితుల్లో ఎందుకు ఉంది?" అని ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమైనా.

Advertisement

ఆ మహిళ మాత్రం ఇప్పుడు రియల్ హీరోయిన్ అని అందరూ ఒప్పుకుంటున్నారు.ఇదిలా ఉండగా.

మరో వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.ఇది బెయిలీ అనే సర్వీస్ డాగ్ గురించినది.

బెయిలీ తన యజమాని ఆరోగ్య సమస్యలో అండగా నిలిచాడు.ఆమె పోస్ట్యురల్ ఆర్థోస్టాటిక్ టాకీకార్డియా సిండ్రోమ్ (POTS) అనే వ్యాధితో బాధపడుతోంది.

దీని వల్ల నిలబడినప్పుడు కళ్లు తిరగడం, నీరసం రావడం జరుగుతుంది.

ఆ వీడియోలో ఆమె కిచెన్‌లో పనిచేస్తుండగా, బెయిలీకి ఏదో తేడాగా అనిపించింది.వెంటనే ఆమె దగ్గరకు వెళ్లింది.కొద్ది క్షణాల్లోనే ఆమెకు కళ్లు తిరగడం మొదలైంది.

వెంటనే ఆమె కూర్చుండిపోయింది.బెయిలీ వెంటనే ఆమెను హత్తుకుని ఓదార్చింది.

అంతేకాదు.రిఫ్రిజిరేటర్ దగ్గరకు పరిగెత్తుంది.

అది యజమాని పట్ల ప్రేమ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.ఈ రెండు వీడియోలు చూస్తుంటే.

నిజమైన హీరోలు మనుషులే కాదు, జంతువులు కూడా అనిపిస్తుంది.

తాజా వార్తలు