జిన్నాకి చుక్క‌లు చూపించిన పోరాట‌యోధుడు..

ఆయ‌న న‌వ‌భార‌త నిర్మాణ రూప‌క‌ర్త‌.అఖండ భార‌త క‌ల‌ల క‌ర్త‌.

ఆయ‌న మాట్లాడితే ప్ర‌భంజ‌న‌మే.జిన్నాకి చుక్క‌లు చూపించిన పోరాట‌యోధుడు.

పార్ల‌మెంట్ సింహంగా పేరుగాంచిన వ్య‌క్తి .ఒకే దేశం ఒకే రాజ్యాంగం అంటూ నిన‌దించిన కార్యోన్ముఖుడు.జ‌న‌సంఘ పార్టీ సృష్టిక‌ర్త‌.

నేటి బిజేపికి దిశానిర్దేశ‌కుడు.ఆయ‌నే డాక్ట‌ర్ శ్యామా ప్ర‌సాద్ ముఖ‌ర్జీ.

Advertisement
The Fighter Who Showed The Dots To Jinnah , Dr Shyama Prasad Mukherjee , Jinna

ఆయ‌న అశువులు బాసిన రోజును బిజేపి బ‌లిదాన దివ‌స్ గా జ‌రుపుకుంటుంది.చిన్నతనంనుండే విద్యకార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న శ్యామాప్రసాద్ అతి చిన్న వయస్సులోనే అంటే 23సంవత్సరంలోనే కలకత్తా యూనివర్సిటీ నియోజవర్గంనుండి లెజిస్లేటివ్ కౌన్సిల్కి కాంగ్రెస్ తరుఫున ఎన్నికయ్యారు.

కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ కౌన్సిల్ను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నా ఆ నిర్ణయాన్ని తప్పుపట్టి పార్టికి రాజీనామా చేయడమే కాకుండా ఇండిపెండెంట్ గా మరోసారి కౌన్సిల్ కి ఎన్నకయ్యారు.

The Fighter Who Showed The Dots To Jinnah , Dr Shyama Prasad Mukherjee , Jinna

శ్యామా ప్రసాద్ విద్యారంగంలో మాత్రమే సేవ చేయడమే కాకుండా రాజకీయంలో కూడా తన దైన ముద్రవేసారు.ఆయన ఒకానొక సందర్భంలో తాను రాజకీయాలకు దూరంగా వుండాలనుకున్నానని విద్యారంగానికి సేవచేయడంలోనే దేశానికి సేవచేసినట్లవుతుందని భావించానని తెలిపారు.అయితే బెంగాల్లో హిందువులపై ముస్లీం లీగ్ చేస్తున్న అరాచకాలను చూసి రాజకీయాల్లోకి వచ్చారు.

The Fighter Who Showed The Dots To Jinnah , Dr Shyama Prasad Mukherjee , Jinna

ఆ విధంగా భారతమాత ముద్దుబిడ్డ శకం ముగిసింది.అయితే డాక్టర ముఖర్జీ పోరాటం ఊరికే పోలేదు.నెహ్రు శకం ముగిసింది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

వారి వంశస్తుల శకం కూడా ముగిసింది.కాంగ్రెస్ కూడా అధఃపాతాళానికి పోయిందనే చెప్పాలి.

Advertisement

దేశ వ్యతిరేక శక్తులపై పోరాటంసాగుతూనే వుంది వారిని మట్టుపెడుతున్నాం కూడా.డాక్టర్ ముఖర్జీ స్తాపించిన జనసంఘ్ 1980లో బిజేపిగా అవతరించి 1993,1998-2004 ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.2014నుండి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో పూర్తి మెజారిటీ ప్రభుత్వం .ఏ ఆదర్శాలతోనైతే డాక్టర్ ముఖర్జీ పార్టీని స్థాపించారో అవే ఆదర్శాలతో బిజేపి ప్రభుత్వం నరేంద్రమోడీ నాయకత్వంలో ముందుకుసాగుతోంది.మోడీ ప్రభుత్వం డాక్టర్ ముఖర్జీ కలలు కన్న అవిబాజ్య భారత్ నినాదంతో ముందుకువెళుతోంది.

చారిత్రాత్మకమైన ఆర్టికల్ 370 ని రద్దుచేసి మువ్వన్నెల జెండా శ్రీనగర్ సెక్రటేరియట్ మీద ఎగిరేల చేసింది మోడీ ప్రభుత్వం.డాక్టర్ ముఖర్జీనినాదమైన ఒకే దేశం ఒకేవిధానం ఒకే ప్రధాని అన్న కలని ఒకే దేశం ఒకే రాజ్యాంగం అన్న నినాదంతో ముందుకువెళుతోంది మోడీ ప్రభుత్వం.

తాజా వార్తలు