వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ది ఫ్యామిలీ మెన్2

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత డిజిటల్ ఎంట్రీ ఇచ్చి మొదటి సారి నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ 2.

ఈ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో రోల్ లో సమంత నటించింది.

ఇక అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ కి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.ఫ్యామిలీ మెన్ మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ సీజన్ పై ప్రేక్షకులకి ఆసక్తి ఏర్పడింది.

దానికితోడు ఇందులో సమంత లాంటి స్టార్ హీరోయిన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందని ముందు నుంచి ప్రచారం ఉండటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.దానికి తగ్గట్లుగానే వెబ్ సిరీస్ ఊహించని స్పందన సొంతం చేసుకుంది.

ఇక వెబ్ సిరీస్ వీక్షించిన ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల సంఖ్య రెట్టింపు అయ్యింది.దీంతో మొదటి సారి ఈ వెబ్ సిరీస్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

Advertisement
The Family Man 2 Created World Record In IMDb, Samantha, Raj And DK, Tollywood,

ఇండియన్ వెబ్ సిరీస్ లో ఇప్పటి వరకు ఏ వెబ్ సిరీస్ కి రాని స్పందన ది ఫ్యామిలీ మెన్2కి రావడం విశేషం.మనోజ్ భాజ్ పాయ్, సమంత ఒకరికి ఒకరు పోటీ పడి నటించారు.

దీంతో చూసిన ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా కథనం సాగింది.దర్శకద్వయం రాజ్ అండ్ డీకే టేకింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

The Family Man 2 Created World Record In Imdb, Samantha, Raj And Dk, Tollywood,

ఇదిలా ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు మరో అరుదైన గుర్తింపుని సొంతం చేసుకుంది.ఐఏండిబి విడుదల చేసిన తాజా జాబితాలో ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది .హాలీవుడ్ వెబ్ సిరీస్ లతో సమానమైన క్రేజ్ తో టాప్ 4 పాపులర్ వెబ్ సిరీస్ గా నిలిచింది.ఓ విధంగా మొదటి వెబ్ సిరీస్ కె ఈ స్థాయిలో క్రేజ్ రావడం నిజంగా సమంతకి దక్కిన క్రెడిట్ అనుకోవచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు