మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ పై కేసు..!

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై కేసు నమోదైంది.భార్య జ్యోతి ఆత్మహత్యపై బంధువులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

బంధువుల ఫిర్యాదుతో మున్సిపల్ కమిషనర్ పై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.విచారణలో భాగంగా జ్యోతి, బాలకృష్ణ ఫోన్ లను సీజ్ చేశారు.

నిన్న జ్యోతి ఉరివేసుకుని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే.అయితే గత కొన్నాళ్లుగా అదనపు కట్నం కోసం తమ కూతురిని భర్త బాలకృష్ణ వేధించాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement