పార్టీలో ఉన్న కారు నాది కాదు.. ఎమ్మెల్యే కాకాణి

బెంగళూరులో( Bengaluru ) కలకలం సృష్టించిన రేవ్ పార్టీ( Rave Party ) వ్యవహారంపై ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి( MLA Kakani Govardhan Reddy ) స్పందించారు.

రేవ్ పార్టీలో ఉన్న కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

పార్టీలో ఉన్న కారు( Car ) తనది కాదని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు.కారు మీద ఏ స్టిక్కర్ ఉందో తాను చూడలేదని తెలిపారు.

తన పేరు మీద స్టిక్కర్ ఉందని వేరే వాళ్లు ఫోన్ చేస్తే తనకు తెలిసిందని వెల్లడించారు.ఈ క్రమంలోనే తనకు సంబంధం లేని ఘటనపై తాను స్పందించనని తెలిపారు.

కాగా ఎలక్ట్రానిక్ సిటీ( Electronic City ) సమీపంలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Advertisement
వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్

తాజా వార్తలు