తెలంగాణలో కొలిక్కి వచ్చిన బీజేపీ - జనసేన పొత్తు

తెలంగాణలో బీజేపీ - జనసేన పొత్తు కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.

ఈ మేరకు ఒకటి, రెండు స్థానాలు మినహా మిగతా స్థానాలకు ఇరు పార్టీలకు చెందిన నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.

పొత్తులో భాగంగా జనసేన మొత్తం తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే జనసేనకు కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, నాగర్ కర్నూల్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి, తాండూరు, కోదాడ నియోజకవర్గ స్థానాలను ఇవ్వబోతున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఈనెల 7న ప్రధాని మోదీ నిర్వహించే బీసీ బహిరంగ సభలో జనసేన పాల్గొననుందని తెలుస్తోంది.

డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? అయితే ఈ నూనె వాడాల్సిందే!
Advertisement

తాజా వార్తలు