ఏపీలో ఆ సామాజిక వర్గాన్నిటార్గెట్ చేస్తున్న బీజేపీ..

మిగ‌తా పార్టీలు వేరు.బీజేపీ వేరు అనే టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది.

ఎందుకంటే ఆ పార్టీ ఒక సామాజిక వ‌ర్గాన్ని న‌మ్ముకోకుండా మొత్తం హిందువుల న‌మ్ముకుని రాజ‌కీయాలు చేస్తుంది.మొద‌టి నుంచి అదే సిద్ధాంతాన్ని పాటిస్తోంది.

గంప గుత్త‌గా హిందువుల ఓట్ల‌ను టార్గెట్ చేయ‌డంలో బీజేపీ ముందు వ‌రుస‌లో ఉంటుంది.అంతే గానీ ఒక సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తే హిందువుల ఓట్లు చీలిపోతాయ‌ని బీజేపీకి బాగా తెలుసు.

కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం ఒక సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తోంది.వారిని ఆధారంగా చేసుకుని బ‌ల‌ప‌డాల‌ని చూస్తోంది.

Advertisement
The BJP Is Targeting That Social Group In The AP Details, BJP, Ap Politics, Hind

మొన్న తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్ షా ఇదే విష‌యాన్ని పార్టీ నేత‌ల‌కు సూచించారంట‌.ఏపీలో మొద‌టి నుంచి ఆర్థికంగా, రాజ‌కీయంగా బ‌లంగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేందుకు ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది.

క‌మ్మ ఓట‌ర్లు ఏయే జిల్లాల్లో ఎంత ఉన్నార‌ని, వారి ఆర్థిక‌, రాజ‌కీయ బ‌లాన్ని జిల్లాల వారీగా తెలుసుకున్నారంట‌.నిజానికి క‌మ్మ అంటే టీడీపీకి మొద‌టి నుంచి అండ‌గా ఉన్న వ‌ర్గం.

కానీ అమిత్ షా లెక్క‌ల ప్ర‌కారం వారు బ‌లంగా ఉన్న చోట వైసీపీ చాలా సీట్లు గెలుచుకుంది.అంటే వారి మ‌ధ్య కూడా చీలిక వ‌చ్చింద‌ని అమిత్ షా అంచ‌నా వేస్తున్నారు.

పైగా క‌మ్మ అంటే బీసీ కింద‌కు వ‌స్తుంది కాబ‌ట్టి బీసీల‌కు పెద్ద పీట వేస్తున్న పార్టీగా ఉంటుంద‌ని అమిత్ షా భావిస్తున్నారంట‌.

The Bjp Is Targeting That Social Group In The Ap Details, Bjp, Ap Politics, Hind
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

క‌మ్మ‌ల మ‌ధ్య ఉన్న గ్యాప్‌ను తాము క్యాచ్ చేసుకోవాల‌ని ఆయ‌న నేత‌ల‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది.టీడీపీ మీద క‌మ్మ వ‌ర్గానికి న‌మ్మ‌కం పోతోంద‌ని కాబ‌ట్టి వారిన వైసీపీ వైపు పోకుండా త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని అమిత్ షా సూచించిన‌ట్టు తెలుస్తోంది.క‌మ్మ వ‌ర్గాన్ని పార్టీకి ద‌గ్గ‌ర చేసే ప‌నిని అదే వ‌ర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి అప్పగించిన‌ట్టు స‌మాచారం.

Advertisement

పార్టీలో కూడా వారికి పెద్ద పీట వేయాల‌ని చెప్పారంట‌.ఇప్ప‌టికే సోము వీర్రాజుకు అధ్యక్ష ప‌దవి ఇచ్చిన‌ట్టు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.మ‌రి ఆయ‌న అంచ‌నాలు ఏ మేర‌కు స‌ఫ‌లం అవుతాయో చూడాలి.

తాజా వార్తలు