Waltair Veerayya Veerasimha Reddy : సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు.. మరి డేట్స్ క్లారిటీ ఎప్పుడు?

ఏ ఇండస్ట్రీలో అయినా కొన్ని ప్రత్యేక పండుగలకు సినిమాలను రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనే సెంటిమెంట్ ఉంటుంది.

అదే విధంగా మన టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.

ప్రతి ఏడాది లాగానే వచ్చే ఏడాది 2023 సంక్రాంతి కూడా రసవత్తరమైన పోరు జరగనుంది.మరి ఇప్పటికే ఈ బరిలో నాలుగు సినిమాలు వస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఇప్పటికే ఆదిపురుష్ ఈ పోటీ నుండి తప్పుకుంది.అయినా కూడా నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

అందులో రెండు తెలుగు సినిమాలు కాగా.రెండు తమిళ్ సినిమాలు.

Advertisement

ఈ నాలుగు సినిమాల మధ్య పోటీ బాగానే ఉండబోతుంది.మరి ఈసారి రేస్ లో ఎవరు ఉన్నారంటే.

ఈసారి సంక్రాంతి బరిలో వీరసింహ రెడ్డి సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బరిలో దిగబోతున్నారు.ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు తమిళ్ సినిమా వరిసు కూడా రిలీజ్ కాబోతుంది.

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడబోతున్నారు.

వాల్తేరు వీరయ్య సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలను సంక్రాంతి బరిలో దింపుతున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.ఈ మూడు సినిమాలతో పాటు మరో తమిళ్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.

Advertisement

విజయ్ వరిసు సినిమాకు పోటీగా అజిత్ కుమార్ తునివు కూడా రిలీజ్ కాబోతుంది.హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బోణీ కపూర్ నిర్మిస్తున్నారు.అయితే ఈ నాలుగు సినిమాలు బరిలో ఉన్నాయని చెప్పారు కానీ ఇంకా రిలీజ్ డేట్స్ మాత్రం ప్రకటించలేదు.

మరి రిలీజ్ డేట్స్ పై కూడా ఒక క్లారిటీ అనేది ఇస్తే ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతారు.