టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లతో పాటు కమెడియన్లకి కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉందని చెప్పాలి.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లుగా నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.
ఇలా కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో నటుడు ప్రియదర్శి ఒకరు.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లిచూపులు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని కమెడియన్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సినీ ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను తన కామెడీ పంచ్ డైలాగులతో ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ప్రియదర్శి తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా కొన్ని విషయాలను వెల్లడించారు.
అయితే ఇప్పటివరకు తాను తనకు అనుగుణంగా ఉన్నటువంటి పాత్రలలో నటించానని తెలిపారు.అయితే తనకి కొన్నిసార్లు నచ్చని పాత్రలు కూడా వస్తుంటాయి.
అలాంటి సమయంలో నో చెప్పలేని పరిస్థితి ఇలా ఒకసారి నచ్చని పాత్రలు వస్తే నో చెప్పడం కూడా ఓ పెద్ద కల అంటూ ఈయన సమాధానం చెప్పారు.
మనకు నచ్చని పాత్ర వస్తే నచ్చలేదు, నేను చేయనని చెబితే మనకు తల పొగురు ఎక్కువ అనుకుంటారు. వీడొక పెద్ద ఆర్టిస్టు మరి వీరికి నచ్చాలంట అని కూడా చాలామంది అంటారు.అందుకే నో అనే ఒక అక్షరం మాట్లాడాలన్నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేకపోతే చాలా జరిగిపోతాయంటూ ఈ సందర్భంగా ప్రియదర్శి తెలిపారు.
ఇకపోతే ఈయనకు కనుక నచ్చని పాత్రలు వస్తే తన మేనేజర్ కి చెప్పి ఇప్పుడు కాదు లెండి తర్వాత చూద్దామని ఏదో ఒకటి మేనేజ్ చేసే ఆ సినిమా నుంచి తప్పించుకుంటానంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy