రేవంత్ కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న ఆ మీడియా?

తెలంగాణ ఎన్నికల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేజిక్కించుకోవాలని అన్నీ ప్రయత్నాలు చేసున్న కాంగ్రెస్కు ఈసారి మీడియా మద్దతు కూడా భారీగానే దక్కుతుంది.

ముఖ్యంగా కేసీఆర్( KCR ) అంటే పడని కొన్ని మీడియా వర్గాలు రేవంత్ కు( Revanth Reddy ) అండగా నిలబడుతున్నాయి .

పైగా ఈసారి తెలుగుదేశం కూడా రేసులో లేకపోవడంతో ఇప్పుడు దాని అనుకూల మీడియాకు ( Media ) కూడా ఫ్రీ హ్యాండ్ వచ్చినట్లయ్యింది .దాంతో తమ పూర్తిస్థాయి నెట్వర్క్ ను అనుభవాన్ని రేవంత్ కోసం ఉపయోగిస్తున్నట్లుగా కనిపిస్తుంది.వరుస పెట్టి ఇంటర్వ్యూలు తీసుకుంటూ, బారీ మీడియా కవరేజ్ ఇస్తూ ప్రజల్లో ఆయనను పాపులర్ చేసే ప్రయత్నాలను ఆ మీడియా మొదలుపెట్టింది .అంతేకాకుండా రేవంత్ కు కాంగ్రెస్ లో( Congress ) కూడా పెద్ద ఎత్తున ప్రత్యర్థులు ఉన్నారు, కాంగ్రెస్ గెలిస్తే ఆయననే కచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తారనే వాతావరణం లేదు.

That Media That Is Going All Out For Revanth Reddy Details, Revanth Reddy, Bhatt

ముఖ్యమంత్రి పదవి( CM Seat ) కోసం ఇంకో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా పోటీ పడుతున్నారు.ముఖ్యం గా బట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) రేవంత్ కు సమాన స్థాయిలో నిలబడి ఉన్నారు.వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి కావడం, వివాదరహితుడుగా పేరు పొందడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది.

అయితే కాంగ్రెస్ గెలుపు కన్నా రేవంత్ ముఖ్యమంత్రి అయితేనే తమకు అనుకూల వాతావరణం ఏర్పాటు అవుతుందని భావిస్తున్న ఆ మీడియా అధిపతి తెలంగాణ ఎన్నికల్లో( Telangana Elections ) రేవంత్ తన భుజస్కందాలపై కాంగ్రెస్ ను నిలబడుతున్నారన్న వాతావరణాన్ని , ఆ హైప్ ను తన ప్రసారాల ద్వారా క్రియేట్ చేస్తున్నారట .కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటూ వరుస కథనాలను ప్రచారం చేస్తూ ఉండటం గమనార్హం.

That Media That Is Going All Out For Revanth Reddy Details, Revanth Reddy, Bhatt
Advertisement
That Media That Is Going All Out For Revanth Reddy Details, Revanth Reddy, Bhatt

తెలంగాణలో సెటిలైన ఆంధ్ర మూలాలు ఉన్న ఓటు బ్యాంకు ను టార్గెట్ చేస్తున్న మీడియా అదిపతి తెలుగుదేశం అనుకూల బావజాలం ఉన్న రేవంత్ కు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఆయా వర్గాలకు గుర్తు చేస్తూ కథనాలను ప్రసారం చేస్తున్నారట .కెసిఆర్ వ్యతిరేక స్వరం వినిపిస్తూ ఉండడంతో చాలాకాలంగా ఆ మీడియాకు ఆర్దికం గా ప్రభుత్వ మద్దతు కూడా దక్కకపోవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు ఆర్థిక అండదండలు కూడా లభిస్తాయి అని ఆ మీడియా అధిపతి భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.మరి ఆ మీడియా ప్రయత్నాలు ఏ మేరకు విజయవంతం అవుతాయో చూడాలి.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు