ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. 'ఓజి'పై థమన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు రాజకీయాలు.మరో వైపు సినిమాలు అంటూ బిజీ బిజీగా గడుపు తున్నాడు.

పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇంతకు ముందు పవన్ ఒక సినిమా పూర్తి అయిన తర్వాత మరో సినిమా అనౌన్స్ చేసేవాడు.

కానీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం పవర్ స్టార్ స్పీడ్ పెంచేసాడు.పవర్ స్టార్ తన లైనప్ ను గ్యాప్ లేకుండా సెట్ చేసుకోవడమే కాకుండా వాటిని పూర్తి కూడా చేస్తున్నాడు.

ఇప్పటికే ఈయన లైనప్ లో ఉన్న రీమేక్ సినిమాను పూర్తి చేసి మరో సినిమాను కూడా స్టార్ట్ చేసాడు.హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఈ సినిమా ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ముగించుకున్నట్టు తెలుస్తుంది.

ఇది పూర్తి అవ్వగానే ఈయన ప్రకటించిన ఓజి (OG Movie) సినిమా షూట్ స్టార్ట్ చేసాడు.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ఓజి అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం విదితమే.ఈ సినిమా షూట్ ఇటీవలే ముంబైలో గ్రాండ్ గా స్టార్ట్ అయినట్టు టాక్.

ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి మేకర్స్ తాజాగా ఈ సినిమా నుండి వదిలిన గ్లిమ్స్ తో మరింత హైప్ నెలకొంది.

ఈ వీడియోలో మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి.మరి ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ గ్లిమ్స్ లో వచ్చిన మ్యూజిక్ తో ఫ్యాన్స్ పలు వీడియోలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

ఈ క్రమంలోనే ఇలాంటి ఒక వీడియోను షేర్ చేస్తూ థమన్ (Thaman) క్రేజీ వ్యాఖ్యలు చేయడం నెట్టింట వైరల్ అయ్యాయి.ఓజి గురించి చెబుతూ.క్రేజీ ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే.

Advertisement

ఓజి సొంత రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.ఈ సినిమా గురించి థమన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి ఎంటెర్టైనమెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు