మంచి మనసు చాటుకున్న థమన్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో సినీ పరిశ్రమకు చెందని ఎలాంటి పనులు కూడా జరగడం లేదు.

దీంతో చాలా మంది పేద కళాకారులు ఇబ్బందులు పడుతున్నారు.

వారిని ఆదుకునేందుకు టాలీవుడ్‌కు చెందని పలువురు స్టార్స్ ముందుకు వచ్చారు.తమకు తోచినంత విరాళంగా ఇస్తూ ఇతరులకు స్ఫూ్ర్తిగా నిలుస్తున్నారు.

అయితే కేవలం ఆర్టిస్టులే కాకుండా సంగీతం అందించే వారు కూడా పని లేక ఖాళీగా ఉన్నారు.ఇలాంటి వారికి తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్.మ్యూజిషియన్స్ వెల్ఫేర్ కోసం తనవంతుగా రూ.5 లక్షల విరాళం ప్రకటించాడు.హైదరాబాద్, చెన్నైలోని మ్యూజిషియన్స్‌కు ఈ డబ్బు అందేలా చూడాలని థమన్ కోరాడు.

ఇలా ఇంత మొత్తం విరాళం అందించిన థమన్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.అలాగే 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వారిని కూడా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
యాలకులతో ఇలా చేస్తే నోటి పూత..

తాజా వార్తలు