హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు.

గేట్లు తెరవడంతో అభిమానులు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లారు.దీంతో తొక్కిసలాట జరిగి అభిమానులు, పోలీసులు గాయపడ్డారు.

అదేవిధంగా కొందరు అభిమానులు సృహాతప్పి పడిపోవడంతో.హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

అనంతరం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.రెండు గంటల వ్యవధిలో కనీసం వంద టికెట్లు కూడా హెచ్‎సీఏ విక్రయించలేదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు