అరచేతిలో ఆలయ సమాచారం.. దేవాదాయ శాఖ సరికొత్త నిర్ణయం.. 

తరచూ ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం దేవాదాయశాఖ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

పండగలు ప్రత్యేక ఉత్సవాల సందర్భంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిర్వహించే పూజ కార్యక్రమాలు సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ ఫేస్ బుక్, ట్విట్టర్,  వంటి సోషల్ మీడియా ద్వారా వారికి అందజేయాలని సంకల్పించింది.

ఈ నిర్ణయం విదేశాలు ఇతర రాష్ట్రంలో ఉండే వారితో పాటు రాష్ట్రంలోనూ ఆలయ సమాచారాన్ని ఇంటెరట్ లో వెతికితే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఈ సమాచారం ఎప్పటికప్పుడు తెలీక దేవాలయాలలో విశేష కార్యక్రమం పాల్గొన్నాలేకపోతున్నా విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.దీంతో వాటి సమాచారం ఎప్పటికప్పుడు భక్తులకు అందజేసేందుకు వారు ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.

మొదటి దశలో 175  ఆలయాల సమాచారం.ఈ తరహా సమాచారాన్ని ముందుగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న పెద్దపెద్ద ఆలయాల కేటగిరి లో ఉన్న 175 దేవాలయాల సమాచారాన్న భక్తులకు చేయాలని నిర్ణయించారు.

Temples Information Available In Mobile Temples Department New Decision, Temples

ఇప్పటి వరకు వివిధ ఆలయాల్లో భక్తులు దర్శనం లేదా పూజ టికెట్లు కొనుగోలు సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్లు వినియోగించుకోవాలని భావిస్తుంది వాటి ఆధారంగా భక్తులకు వివిధ ఆలయాల్లోని పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేస్తారు.సోషల్ మీడియా కు అనుసంధానం చేసేందుకు ఆయా కార్యక్రమాలకు డిజిటల్ మార్కెటింగ్ కల్పించేందుకు ఒక ఏజెన్సీని ఎంపిక చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది.దీని కోసం ఇప్పటికే టెండర్ ప్రక్రియ చేపట్టింది.

Advertisement
Temples Information Available In Mobile Temples Department New Decision, Temples

రాష్ట్రంలో ఉండే ఆలయాలను ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకు చేరువ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలను మొబైల్ ద్వారా భక్తులకు తెలుసుకునేలా రూపొందిస్తున్నాం.ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మోహన్ తెలిపారు.

అప్పులు తీర్చే గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు