వైసీపీని వ్యతిరేకిస్తున్నా 'గంటా ' ని నమ్మేదెవరు ? 

విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంటూ వస్తోంది.2019 ఎన్నికలకు ముందే గంటా వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు .

వైసీపీ లో చేరి, ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అవ్వాలని చూశారు.కానీ గంటా రాకను వైసీపీలో చాలామంది అడ్డుకున్నారు.

ముఖ్యంగా విజయసాయి రెడ్డి  ఈ వ్యవహారంలో అడ్డు పడ్డారని గంటా అనుచరులు చెబుతూ ఉంటారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన టిడిపిలో కొనసాగుతున్నారు.

అసంతృప్తితోనే పార్టీలో ఉంటూ , రాజకీయంగా బలం పెంచుకునేందుకు చూస్తున్నారు .దీనికితోడు కాపు సామాజిక వర్గాన్ని రాబోయే ఎన్నికల్లో కీలకం చేసేందుకు గంటా ఆధ్వర్యంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.       ఇప్పటికే కాపు సామాజిక వర్గం లోని కీలక నాయకులంతా హైదరాబాదులో సమావేశం నిర్వహించారు.

  తరువాత కొద్ది రోజుల క్రితం విశాఖలోని కాపు సామాజిక వర్గ ప్రముఖులంతా హాజరయ్యారు .ఈ సందర్భంగా వైసిపి పై తీవ్ర విమర్శలు చేసినట్లుగా ప్రచారం  జరిగింది.కాపు సామాజిక వర్గ సమావేశాలు టిడిపి  కోసమే ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న , దీనిపై సరైన క్లారిటీ లేదు.   

Advertisement

  తాను టిడిపిలోనే ఉంటానని, పార్టీ కోసం గట్టిగానే కష్టపడతాను అనే విధంగా గంటా సంకేతాలు ఇస్తున్నా, తెలుగు తమ్ముళ్లు ఎవరు నమ్మే పరిస్థితి లేదని , ఇక చంద్రబాబు సైతం గంటా వ్యవహారంలో మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు.అందుకే ఆయనకు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించలేదు.ఇప్పుడు టిడిపిని చంద్రబాబును నమ్మించేందుకు గంటా ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న ప్రయోజనమే లేదు అన్నట్లుగా పరిస్థితి ఉందట.

ఇప్పటికే ఆయన జనసేన వైపు చూస్తున్నారని, ఎన్నికల సమయం నాటికి ఆ పార్టీ బలం పుంజుకుంటే ఆయన జనసేన లో చేరడం ఖాయం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Advertisement
" autoplay>

తాజా వార్తలు