గాంధీభవన్లో రెపరెపలాడుతున్న తెలుగుదేశం జెండాలు

కాంగ్రెస్( Congress ) నిరంకుశ విధానాలపై విరక్తి చెంది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ కాంగ్రెస్ ఓటమే పునాదిగా ఆవిర్భవించింది .

ఎన్టీఆర్ బ్రతికున్నంత కాలం కాంగ్రెస్కు వ్యతిరేక పార్టీగానే టిడిపి వ్యవహరించింది.

అయితే చంద్రబాబు( Chandrababu ) తెలుగుదేశం పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ తో కూడా దోస్తీ కట్టారు.అయితే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికల్లో నామమాత్ర పలితం తో సరిపెట్టుకున్న టిడిపి ఈ సారి అసలు పోటీ నుంచే విరమించుకుంది.

అయితే తమతో పొత్తు లో ఉన్న జనసేనకు మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్కు లోపాయికారి మద్దతుగా తెలుగుదేశం( Telugudesam ) శ్రేణులు పనిచేసాయి అన్నది బహిరంగ రహస్యం.

Telugudesam Flags Fluttering In Gandhi Bhavan , Gandhi Bhavan , Telugudesam Fl

ముఖ్యంగా అనేక నియోజకవర్గలలో కాంగ్రెస్ ప్రచారం లో ఎగిరిన తెలుగుదేశం జెండాలు వాటిని నిరూపించాయి .అయితే ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు దాదాపు కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితుల్లో గాంధీభవన్ లో రెపరెపలాడుతున్న తెలుగుదేశం జెండాలను చూస్తుంటే కాంగ్రెస్ గెలుపు కోసం తెలుగు తమ్ముళ్లు ఏ స్థాయిలో ప్రయత్నించారో అర్థమవుతుంది.ముఖ్యంగా కేసీఆర్ వ్యతిరేకత, జగన్ పట్ల భారాస చూపుతున్న సోదర ప్రేమ తెలుగుదేశం శ్రేణులను మండించినట్టుగా తెలుస్తుం.

Advertisement
Telugudesam Flags Fluttering In Gandhi Bhavan , Gandhi Bhavan , Telugudesam Fl

ది దాంతో రేవంత్ గెలవాలన్న ఆశ కన్నా కేసీఆర్ ( KCR )ఓడాలన్న పట్టుదలతోనే తెలుగు తమ్ముళ్ళు పనిచేసినట్లుగా తెలుస్తుంది.

Telugudesam Flags Fluttering In Gandhi Bhavan , Gandhi Bhavan , Telugudesam Fl

ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేఖం గా రేగిన నిరసనల పట్ల బారాస ముఖ్య నాయకులు వ్యవహరించిన విధానం ఈసారి చావో రేవో అన్నట్టుగా తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్ గెలుపు కోసం పని చేశారని వార్తలు వచ్చాయి.అది ఇప్పుడు నిజమే అన్నట్లుగా గాందీ భవన్ లో రెపరెపలాడుతున్న తెలుగుదేశం జెండాలు రుజువు చేస్తున్నాయి .ఏది ఏమైనా ఈ రెండు పార్టీల ఐఖ్యత ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి.ఇప్పుడు రేవంత్ గెలుపు నే తమ గెలుపుగా తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

మరి బహిరంగంగా కాంగ్రెస్తో పొత్తుకు చంద్రబాబు అంగీకరిస్తారు లేదో చూడాలి .

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు