ఎప్పుడు చూడు ఎవరొకరిని విడగొట్టడమే.. ఏడుపుగొట్టు సీరియల్స్ ఇంట్లో తలపోటు?

బుల్లితెరపై ప్రస్తుతం సీరియల్స్ హవా బాగా నడుస్తుందనే చెప్పవచ్చు.ఈ సీరియల్స్ హవా అనేది ముందు తరాల నుంచి వస్తూనే ఉంది.

ప్రస్తుతం వెండితెర కంటే ఎక్కువగా బుల్లితెరపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.నిజానికి సీరియల్స్ కి బాగా ఆకర్షితులవుతున్నారు.

సీరియల్ సమయం ప్రారంభం కాగానే సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఆ సమయంలో ఎన్ని పనులు ఉన్నా వదులుకొని మరి చూస్తున్నారు.ఒకప్పుడు సీరియల్ లలో మంచి మంచి కథలు ప్రసారమయ్యేవి.

కానీ ఇప్పుడు వస్తున్న సీరియల్స్ లో అన్ని కథలు ఒకలాగే ఉన్నాయి.ముఖ్యంగా ఒక మగవాడి కోసం ఇద్దరు ఆడవాళ్లు కొట్లాడుతున్న కథలను, ఎవరినో ఒకరిని విడగొట్టే కాన్సెప్ట్ ను తీసుకొని వస్తున్నారు డైరెక్టర్లు.

Advertisement

దీంతో ప్రేక్షకులు కూడా మొదట్లో ఆసక్తి చూపిన అన్ని సీరియల్లలో ఇదే రొటీన్ కథ నడుస్తుంది అని సీరియల్ చూడటం కూడా మానేశారు.హీరో కోసం హీరోయిన్ తో పాటు లేడీ విలన్ కూడా హీరో కోసమే తాపత్రయ పడుతుండడం.

లేదా ఒక హీరోయిన్ కోసం హీరో కానీ విలన్ కానీ వెంటపడటం.ఎవరైనా ఇద్దరు కలిసి ఉంటే.

వాళ్ల కాపురంలో చిచ్చు పెట్టడం లాంటివి మాత్రమే నడుస్తున్నాయి.ప్రస్తుతం అన్ని సీరియల్స్ లో ఇటువంటి స్టోరీలే కనిపిస్తున్నాయి.

కేవలం ఒక్క ఛానల్ లోనే కాదు ఇతర ఛానల్స్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో కూడా ఏడుపు గొట్టు కథలనే చూపిస్తున్నారు డైరెక్టర్లు.ఇక ఈ సీరియల్స్ చూసే ప్రేక్షకులు కూడా ఈ సీరియల్స్ అన్ని ఒకేలా ఉన్నాయని పలుమార్లు కామెంట్లు కూడా పెట్టారు.ఏమి సీరియల్స్ రా బాబు అంటూ.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

ప్రతిరోజు ఏడుపుగొట్టు సన్నివేశాలే, ఎప్పుడు ఎవరిని విడగొడదామా అనే సన్నివేశాలనే చూపిస్తున్నారు అంటూ.ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని.ఈ సీరియల్స్ వల్ల అందరిని చెడగొడుతున్నారు కదా.మంచి సీరియల్స్ ఉంటే చెయ్యండి కానీ.సమాజాన్ని నాశనం చేసే సీరియల్స్ చేయకండి అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

Advertisement

ఈ సీరియల్స్ వల్ల ఇంట్లో తలపోట్లు కూడా ఎదురవుతున్నాయి అంటూ.కాస్త కథనన్న మార్చండి అంటూ లేదా సీరియల్ చేయడమే ఆపండి అంటూ నేరుగా అనేస్తున్నారు.ఎప్పుడు ఎవరినో ఒకరిని విడగొట్టడం తప్ప మరే ఆలోచన ఉండదా.

సీరియల్ అంటే అవే కథలు ఉంటాయా.కాస్త డిఫరెంట్ గా ఆలోచించి.

సమాజానికి ఉపయోగపడే మెసేజ్ లాంటివి ఇచ్చే సీరియల్స్ తీయొచ్చు కదా అని వేడుకుంటున్నారు.ఇటువంటి ఏడుపుగొట్టు సీరియల్స్ మాత్రం రిపీట్ చేయకండి అంటూ.

ఇక అప్పట్లో వచ్చే సీరియల్స్ నయం అని.అందులో మంచి మెసేజ్ కూడా ఉండేది అని అంటున్నారు.ఇక ఇప్పుడు ఒక సీజన్లో అలానే జరిగింది అంటే మరో సీజన్లో కూడా అటువంటి కథతోనే ముందుకు వస్తున్నారు ఈ డైరెక్టర్లు అంటూ.

అందుకే ఈ సీరియల్స్ రేటింగ్స్ కూడా తగ్గుతున్నాయని అంటున్నారు.మరి ఈ వేదన విని ఇకనైనా సీరియల్స్ డైరెక్టర్లు కథలో మార్పులు చేస్తారో లేదో చూడాలి.

తాజా వార్తలు