తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -Telugu NRI America News

1.ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఆటా

 

ఫెడరల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్ లో నిర్వహించిన ఇండియా డే ఫెరేడ్ లో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) పాల్గొంది.

 

2.ఎన్.ఆర్.ఐ లకు గుడ్ న్యూస్

  ఎన్నారైలకు భారత్ శుభవార్త చెప్పింది.భారత్ లోని అన్ని రాష్ట్రాలు ఒకే రకమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ జారీ చేసేలా , కేంద్ర రోడ్డు రవాణా శాఖ, తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. 

3.దుబాయ్  అతిపెద్ద థియేటర్ ప్రారంభం

 

దుబాయ్ హెల్త్ మాల్ లోని రాక్సీ సినిమాస్ ఈ ప్రాంతంలో అతి పెద్ద స్క్రీన్ ను ప్రారంభించింది. 

4.తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం

  తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాష - సాహిత్య వికాసాలకై మహిళా సంస్థల కృషి అనే అంశంపై ఒక ప్రత్యేక సాహిత్య కార్యక్రమం జరిగింది. 

5.బైడన్ పై అమెరికన్ల ఆగ్రహం

 

అమెరికాలో మంకీ ఫాక్స్ కేసులు 17 వేలకు పైగా చేరిపోవడం తో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పై అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బైడెన్ అసమర్థత వల్లే ఇంత ఉధృతంగా మంకీ పాక్స్ వ్యాప్తి చెందిందని మండిపడుతున్నారు. 

6.పాకిస్తాన్ లో వరద బీభత్సం సాయానికి సిద్ధమైన భారత్

 

Advertisement

పాకిస్తాన్ లో కనీవిని ఎరుగని రీతిలో వరద బీభత్సం సృష్టించింది.దాదాపు వెయ్యి మంది వరకు చనిపోగా , ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.దీంతో పాకిస్తాన్ కు సాయం అందించేందుకు భారత్ సిద్ధం అయ్యింది. 

7.ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ త్రీ లో భారతీయుడు

 

ప్రపంచ కుబేరులు జాబితాలో తొలి మూడు స్థానాల్లో స్థానం దక్కించుకున్న  తొలి ఆసియా వ్యక్తిగా గౌతమ్ ఆదాని నిలిచాడు. 

8.భారత్ నుంచి ఉల్లిపాయలు , టమోటాలు దిగుమతి చేసుకోనున్న పాక్

  వరదల కారణంగా పంటలు దెబ్బతినడం తో కూరగాయల ధరలు భారీగా పెరిగి జనజీవనం అస్తవ్యస్తమైంది.

దీంతో భారత్ నుంచి ఉల్లిపాయలు, టమోటోలు దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్ సిద్ధం అయ్యింది.             .

గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?
Advertisement

తాజా వార్తలు