తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.అమెరికా వెళ్లే వారికి ఆ సర్టిఫికేట్ తప్పనిసరి

నవంబర్ 8 నుంచి విదేశీయులు రాక పై  ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

అయితే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు మాత్రమే తమ దేశానికి రావాలని స్పష్టం చేసింది.అమెరికా వచ్చే విదేశీయులు తప్పనిసరిగా టీకా ధ్రువీకరణ పత్రం చూపించాలని పేర్కొంది. 

2.ఎన్నారైల పునరావాసం కోసం రెండు వేల కోట్ల ప్యాకేజీ

  కరోనా సంక్షోభం కారణంగా స్వదేశానికి శాశ్వతంగా తిరిగివచ్చిన ఎన్నారైల పునరావాసం కోసం కేరళ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.విదేశాల నుంచి కేరళకు తిరిగి వచ్చిన వారి కోసం కేంద్రం 2 వేల కోట్లు కేటాయించాలనే ప్రతిపాదన పంపనుంది. 

3.భారత్ కు అధ్భుత కళా ఖండాలు అప్పగింత

  అపహరణకు గురైన పురాతన కళాఖండాల కార్యాచరణ దర్యాప్తులో భాగంగా సుమారు 15 మిలియన్ డాలర్లు విలువచేసే 250 పురాతన వస్తువులను భారత్ కు యూఎస్ తిరిగి ఇచ్చింది. 

4.రష్యాలో కరోనా బీభత్సం

  రష్యాలో కరోనా బీబత్సం సృష్టిస్తోంది.  రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.గురువారం ఒక్క రోజే 40,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

5.భారత ప్రధాని రోమ్ పర్యటన

  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోమ్ నగరంలో పర్యటిస్తున్నారు.శుక్రవారం పియాజా  గాంధీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. 

6.ఫ్రాన్స్ లో బిజీగా కేటీఆర్

  ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ బృందం శుక్రవారం అనేక కంపెనీలు సిఇఓలు, అధికారులతో సమావేశమైంది. 

7.భారతీయులకు ఒమన్ శుభవార్త

Advertisement

  గల్ఫ్ దేశం ఒమన్ భారతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.కోవాక్సిన్ తీసుకున్న వారు సైతం ఒమన్ వెళ్లేందుకు అంగీకారం తెలిపింది. 

8.లక్ష 75 వేల కోట్ల డాలర్ల తో బైడన్ ప్రణాళిక

  బిల్డ్ బ్యాక్ బెటర్ ప్లాన్ కోసం లక్షా 75 వేల కోట్ల డాలర్ల విలువ చేసే పన్నులు, వ్యయ ప్యాకేజీకి ఒక ప్రేమ్ వర్క్ ను అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సిద్ధం చేశారు. 

9.  ఆరుగురు రాయబారుల పై సూడాన్ వేటు

  కుట్ర ద్వారా సూడాన్ లో అధికారాన్ని సైన్యం దక్కించుకోవడాన్ని  వ్యతిరేకించిన ఆరుగురు సూడాన్ రాయబారులను సైనిక ప్రభుత్వం తొలగించింది.   .

Advertisement

తాజా వార్తలు