తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 9, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.20

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఆరుద్ర శివ పూజలు మంచిది.

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
న్యూస్ రౌండప్ టాప్ 20 

ఉత్సాహపరిచే కార్యక్రమాలు పాల్గొంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ధన లాభాలని పొందుతారు.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

వ్యాపారస్తులకు పనులు త్వరగా పూర్తవుతాయి.

మిథునం:

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దైవ దర్శనాలు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

సింహం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.మీరు పనిచేసే చోట కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి లేదా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులెదురవుతాయి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన వస్తువులను వీలైనంత వరకు కొనుగోలు చేయకపోవడం మంచిది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

తుల:

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తోబుట్టువుల నుండి ఆర్థిక విషయంలో వాదనలు జరుగుతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.

ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనుస్సు:

ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.

వ్యాపారులు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మకరం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగే అవకాశం ఉంది.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల పని త్వరగా పూర్తవుతుంది.కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

ఈరోజు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు.