తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి23, ఆదివారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.19

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.28

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి.వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు, కానీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

వృషభం:

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మిథునం:

Advertisement

ఈరోజు మీరు ప్రారంభించే పనుల్లో కొన్ని ఆటంకులు ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు ఆకస్మిక ధన లాభం.ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది.

వ్యాపారపరంగా నూతన అవకాశాలు అందుకుంటారు.

సింహం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.

కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు.వృత్తి వ్యాపారాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.

కన్య:

ఈరోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితానిస్తాయి.ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

తుల:

ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి.

ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృశ్చికం:

ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

ధనుస్సు:

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి అవసరానికి తన సహాయం అందుతుంది.అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

భూ సంభందిత క్రయ విక్రయాల కలసివస్తాయి.వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం:

ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు.కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి.

వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.

కుంభం:

ఈరోజు సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది.స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.

నూతన వాహనం కొనుగోలు చేస్తారు.భాగస్వామ్య వ్యాపార విస్తరణలో పురోగతి సాధిస్తారు.

వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

మీనం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.చేపట్టిన పనులు మందగిస్తాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి.ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

తాజా వార్తలు