తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి19, ఆదివారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.04

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: షష్టి సామాన్యము

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.బంధు మిత్రులతో విభేదాలు కలుగుతాయి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి.వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఇది కలా...నిజమా వైరల్ అవుతున్న నటి శోభిత పోస్ట్.... ఏమైందంటే?
అల్లు అర్జున్ ఆ తమిళ్ డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వబోతున్నాడా..?

ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు ఆదాయం మరింత పెరుగుతుంది.రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం:

ఈరోజు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు.సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.

పని ఒత్తిడి అధికమవుతుంది.దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.

కర్కాటకం:

ఈరోజు అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం:

ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కన్య:

ఈరోజు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

తుల:

ఈరోజు సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి.చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.

సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

వృశ్చికం:

ఈరోజు ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వ్యాపారమున ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది.శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి.

వృధా ఖర్చులు చేస్తారు.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి.

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు:

ఈరోజు ఇంటబయట శుభ ఫలితాలను పొందుతారు.సమాజంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి.దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు.

వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు.దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు

మకరం:

ఈరోజు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి.బంధువుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి.ఉద్యోగ విషయమై చెయ్యను పనికి నిందలు పడతారు.

నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.

కుంభం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది.చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది.

నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి.వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.

ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

మీనం:

ఈరోజు ఋణ పరమైన ఒత్తిడిలు మానసిక సమస్యలు కలిగిస్తాయి.ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది.చేపట్టిన పనులు చాలాకష్టం మీద పూర్తి అవుతాయి.

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.వ్యాపారాలలో నష్ట సూచనలున్నవి.

ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు.

తాజా వార్తలు