తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 22 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం(Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.52

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

00

రాహుకాలం: మ.03:00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ 03:45 నుంచి 06:22 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ: 5:52 నుంచి 09.06 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఇన్నాళ్లు పడిన కష్టానికి మంచి ఫలితం దక్కుతుంది.ఈరోజు కొన్ని ఆర్ధిక సమస్యల వల్ల మీరు డబ్బు విలువ తెలుసుకుంటారు.మీ తల్లితండ్రులు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు.

వృషభం:

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

ఈరోజు నుంచి ధనాన్ని పొదుపు చెయ్యడం ప్రారంభిస్తారు.వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు.ఏదైనా సమస్య వస్తే ఆవేశంతో కాకుండా ఆలోచనతో పరిష్కరించుకోవాలి.

Advertisement

ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథునం:

ఈరోజు కొన్ని కారణాల వల్ల మీకు మనశాంతి లేకుండా పోతుంది.కానీ మీ స్నేహితుడు ఒకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతో సహాయం చేస్తారు.ఈరోజు సమస్య నుంచి ఎంతో సులభంగా బయటపడతారు.

మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోష పెడుతుంది.

కర్కాటకం:

ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు.ఇన్నాళ్లు కష్టపడి చేసిన పనికి మీకు మంచి ఫలితం దక్కుతుంది.అనుకోని బంధువుల రాకతో కొంచెం ఆర్ధిక ఇబ్బందులు పడినప్పటికీ సంతోషంగా సమయాన్ని గడుపుతారు.

సింహం:

కుటుంబసభ్యులు, మీ అభిప్రాయాలని సమర్థిస్తారు.వ్యాపారాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతారు.అలా పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది.

కన్య:

మీ పనులు ఈరోజు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయ్.దగ్గరివారితో మంచి సమయాన్ని గడుపుతారు.ఆర్థికనష్టాలు లేకుండా ఉండాలంటే కొన్ని విషయాల్లో అలోచించి అడుగులు వెయ్యాలి.

కుటుంబంలో ఒకరు మీకు మంచి శుభవార్తను చెప్తారు.

తులా:

పని ఒత్తిడి కారణంగా మీరు కుటుంబంతో సమయాన్ని గడపలేరు.గతంలో తీసుకున్న అప్పులు మీ వెంటపడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయ్.వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత మీకు సంతోష సమయాన్ని గడుపుతారు.

వృశ్చికం:

కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది.భవిష్యత్తులో వారు ఎంతో ముఖ్యమైన వారు అవుతారు.కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు వస్తాయ్.

ఇతరుల కోసం ఎక్కువ పని చేస్తున్నట్టు తెలుసుకుంటారు.

ధనస్సు:

మీ ఆరోగ్యం బాగుంటుంది.ప్రయాణం చేసే సమయంలో మాత్రం అవసరసం ఉంటేనే చెయ్యాలి.ఇక ఉద్యోగ విషయంలో కొన్ని చికాకులు ఉన్నప్పటికి ఆర్ధికంగా ఎటువంటి సమస్య లేకుండా బయటపడతారు.

మీ కుటుంబసభ్యులు మిమ్మల్ని ఈరోజు ఎంతో సంతోష పెడుతారు.

మకరం:

ఈరోజు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు మిమ్మల్ని విసిగిస్తున్నట్టు అనిపిస్తే మాట్లాడటం ఆపేయండి.కోపం తెచ్చుకోకండి.ప్రశాంతంగా నవ్వుతూనే కనిపించండి.

లేదంటే ఉద్యోగం పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

కుంభం:

ఏదైనా సొంతంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టండి.ఊహలు ఆధారితమైన పథకాల్లో పెట్టుబడులు పెట్టకండి.నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్.

మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు.అయినప్పటికి అక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతాయ్.

మీనం:

ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు.గతంలో పడిన కష్టానికి మీకు మంచి ఫలితం దక్కుతుంది.సాయింత్రం స్నేహితులతో సంతోషంగా సమయాన్ని కేటాయిస్తారు.

సీనియర్ల నుంచి ఉద్యోగుల నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది.

తాజా వార్తలు