తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 14, బుధ వారం, 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.06

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

20

రాహుకాలం:మ.12.00 మ.1.30 వరకు

అమృత ఘడియలు: ఉ.చవితి సా6.00 ల7.30వరకు

Advertisement

దుర్ముహూర్తం: మ.11.57 మ.12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ప్రారంభించిన ప్రతి పనిలో శుభమే జరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి చాలా ఉత్సాహంగా ఉంటారు

వృషభం:

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

ఈరోజు మీరు ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.

Advertisement

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మిథునం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

కొన్ని వర్గ సంబంధిత గొడవలు జరిగే అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

సింహం:

ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు కొందరి ప్రవర్తన మీ మనసులో బాధను కల్పిస్తుంది.

అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

తులా:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.రాజకీయ నాయకులకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు వ్యవసాయదారులు మంచి లాభాలను పొందుతారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీరు చేసే వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.తోటి సలహాల వలనకొన్ని సమస్యల నుండి బయటపడతారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందిస్తుంది.

కుంభం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తాజా వార్తలు