తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 25, ఆదివారం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 6.46

సూర్యాస్తమయం:సాయంత్రం 05.43

రాహుకాలం: సా.

4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు: మ.2.00 సా4.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం:సా.5.02 ల5.53వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

వృషభం:

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమం ఏ సమయంలో చేయాలో తెలుసా..!

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు రాకుండా చూసుకోండి.ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడమే మంచిది.

Advertisement

తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మిథునం:

ఈరోజు మీ బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.ఉద్యోగంలో సభ్యులతో కొన్ని చికాకులు తప్పవు.

కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

కన్య:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

స్నేహితులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

తులా:

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాలను పాల్గొంటారు.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.

మకరం:

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.వ్యాపారానికి సంబంధించిన పెట్టబడి విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వారితో కలిసి బయట సమయాన్ని కూడా కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

తాజా వార్తలు