ఈ నటి అలాంటి సినిమాల్లో నటించడం వల్లే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయిందా..?

ఒక్కోసారి కొంతమంది నటీనటులు ఎలాగైనా సినిమా పరిశ్రమలో అవకాశం దక్కించుకొని తమ నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి ఎలాంటి పాత్రలోనైనా లేదా చిత్రాలలో నటించడానికి సిద్ధపడుతుంటారు.

కానీ కొంతమందికి వారు నటించిన  చిత్రాలు లేదా పాత్రల కారణంగానే వారి యొక్క సినిమా కెరియర్ మలుపు తిరగడం లేదా ముగిసి పోవడం వంటివి జరుగుతాయని చాలా మందికి తెలియదు.

కాగా తెలుగులో పలు ధారావాహికలు మరియు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించిన నటి వహీదా కూడా ఈ కోవకే చెందుతుంది.అయితే నటి వహిదా కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొంత మేర బోర్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రల్లో కూడా నటించింది.

నటన పరంగా మంచి ప్రతిభ ఉన్నటువంటి వహీదా తాను ఎంచుకున్న చిత్రాలు మరియు పాత్రల కారణంగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమైంది.దీనికితోడు సినిమా పరిశ్రమలో నిలకడ లేకపోవడం మరియు తనకంటూ చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు లభించ లేదు.

ఒకానొక సమయంలో పలు బి గ్రేడ్ ఫిలిమ్స్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది.దీంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి.

Advertisement

అయితే అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కనిపిస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం వరించడం లేదు. దీంతో ప్రస్తుతం వహీదా సినిమా కెరియర్ చాలా చప్పగా సాగుతోంది.

ఈ విషయం ఇలా ఉండగా తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో నటి వహీదా దాదాపుగా 50 కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.ఇందులో ఓ రాధ కథ, తకిట తకిట, కౌసల్య ఆంటీ, నిన్ను వీడని నీడను నేను, అనాగరికం, జయమ్ము నిశ్చయమ్ము రా, కాల భైరవ తదితర చిత్రాలు ప్రేక్షకులను ఫర్వాలేదనిపించాయి.

అయితే నటి వహిదా ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా పలు ధారావాహికలతో బాగానే ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం తెలుగులో ఓ అమృతం కురిసిన రాత్రి అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు