బిగ్‌బాస్‌ రేటింగ్‌ ప్రభావం... వీక్‌డేస్‌ టైమింగ్‌ మార్చుతున్నారు

తెలుగు బిగ్ బాస్‌ మొదటి మూడు సీజన్‌లకు మంచి రేటింగ్‌ వచ్చింది.

ప్రస్తుతం కొనసాగుతున్న నాల్గవ సీజన్‌కు కూడా మొదటి రెండు మూడు వారాలు బాగానే రేటింగ్‌ వచ్చింది.

ఆ తర్వాత తర్వాత రేటింగ్‌ దారుణంగా పడిపోయింది.నిర్వాహకులకు భారీ నష్టాలు తప్పడం లేదు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా వీక్‌ డేస్‌ రేటింగ్‌ మరీ వీక్‌ గా ఉండటంతో నిర్వాహకులు మొదట్లో తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.గొడవలు పెట్టేందుకు రొమాంటిక్‌ సన్నివేశాలను చూపించేందుకు ప్రయత్నించారు.

కాని బిగ్‌ బాస్‌ వీక్‌ డేస్‌ రేటింగ్‌ మాత్రం పెరగలేదు.ఏం చేసినా కూడా ఆ రేటింగ్‌ పెరగక పోవడంతో ఏం చేయాలో పాలు పోక క్రియేటివ్‌ టీమ్‌ ప్రోమోలతో నెట్టుకు వస్తున్నారు.

Advertisement

ఈ సమయంలో స్టార్‌ మా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.బిగ్‌ బాస్‌ వీకెండ్స్‌ లో రాత్రి 9 గంటలకు మరియు వీక్‌ డేస్‌లో రాత్రి 9.30కి ప్రసారం అవుతున్న విషయం తెల్సిందే.బిగ్‌బాస్‌ వీక్‌ డేస్‌ టైమింగ్‌ను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ వారం కాకుండా మరో రెండు వారాల్లో షో ముగియబోతుంది.ఈ నేపథ్యంలో షోను నిర్వాహకులు రాత్రి 10 గంటల నుండి ప్రసారం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.రాత్రి 9.30కి వదినమ్మ సీరియల్‌ ను ప్రసారం చేయాలనే ఉద్దేశ్యంతో స్టార్‌ మా ఉన్నారు.సీరియల్‌ కు మంచి ఆధరణ ఉన్నా కూడా టైమింగ్‌ సరిగా లేని కారణంగా రేటింగ్‌ రావడం లేదు.

ఆ కారణంగానే ఈ టైమ్‌కు మార్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా వదినమ్మ సీరియల్‌ ఉంది.కనుక రేటింగ్‌ రాని బిగ్‌ బాస్‌ ను పక్కకు పెట్టి ఈ సీరియల్ ను ముందుకు తీసుకు వచ్చారంటూ బుల్లి తెర వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది నిజంగా బిగ్‌ బాస్‌కు అవమానం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రేటింగ్‌ బిగ్‌ బాస్‌కు ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు