తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్25, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం: ఉదయం 6.47.సూర్యాస్తమయం: సాయంత్రం.

5.44.రాహుకాలం: ఉ.7.30 ల9.00.అమృత ఘడియలు: ఉ.9.30 ల10.30 సా4.00 ల6.00.దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11.

మేషం:

ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.సంతానం నుండి శుభవార్తలు అందుతాయి.దైవదర్శనాలు చేసుకుంటారు.ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. .

వృషభం:

ఈరోజు నూతన వాహన యోగం ఉన్నది.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.ఉద్యోగులకు జీతాభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.గృహమున బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. .

మిథునం:

ఈరోజు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.నూతన రుణాలు చేస్తారు.వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.వ్యాపార ఉద్యోగాలు చికాకు తప్పవు.కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు.బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. .

సింహం:

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.ఇంటాబయట అనుకూల వాతావరణ ఉంటుంది.వ్యాపారాలు విస్తరిస్తారు.ఆప్తుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.మీ స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు. .

కన్య:

ఈరోజు ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు. .

తుల:

ఈరోజు నూతన రుణాలు చేస్తారు.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత ఉండదు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. .

వృశ్చికం:

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 1, మంగళవారం 2024

ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. .

మకరం:

ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు.పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. .

కుంభం:

ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు.దైవ చింతన పెరుగుతుంది.ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. .

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తాజా వార్తలు