కరోనా తో షేక్ అవుతున్న తెలంగాణా,భయం గుప్పిట్లో జనాలు

ఒక్కోరోజు కరోనా తగ్గుముఖం పడుతుంది అనుకుంటుండగానే ఒక్కసారిగా కేసులు పెరిగిపోతూ కంగారు పెట్టేస్తుంది.

అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య కరోనా నిలబడలేదు అని నిపుణులు చెప్పిన ప్రకారం చూసుకున్నా కరోనా కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా ఋతుపవనాలు కూడా త్వరలోనే తెలుగు రాష్ట్రాలను తాకుతాయి అని చెప్పగానే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అత్యధికంగా 40 కి పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయితేనే తగ్గుముఖం పట్టని కరోనా ఋతుపవనాలు మొదలైతే పరిస్థితి ఏంటి అనేది ఆందోళన కలిగిస్తుంది.

Today 199 Positive Cases In Telangana State, Telangana,Coronavirus, Telangana He

తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణా లో మరోసారి రికార్ట్ స్థాయిలు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.ఒక్కరోజే 199 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

జిల్లాల్లోనూ కరోనా విజృంభించడంతో ఆయా జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 40 కేసులు నమోదు కాగా, మహబూబ్ నగర్‌లో 3, సూర్యాపేటలో 1, నిర్మల్‌లో 1, వరంగల్ అర్బన్‌లో 2, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1, మేడ్చల్ 10, జగిత్యాల 3, ఖమ్మం 9, జనగాం 1, వలస కార్మికులలో 3 కేసులు నమోదయ్యాయి.

Advertisement

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,698కి చేరగా, తాజాగా ఐదుగురు మృతిచెందడం తో మృతుల సంఖ్య 82కు చేరుకున్నట్లు తెలుస్తుంది.అలానే ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,428కి చేరింది.

ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,188 ఉన్నట్లు సమాచారం.అయితే నిపుణుల హెచ్చరికల మేరకు వర్షాకాలం రాబోతున్న నేపథ్యంలో కరోనా ఏ రేంజ్ లో విజృంభిస్తుందో అని అటు అధికారులు ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క కేంద్రం కూడా ఈ అంశాలను పరిగణలోకి తీసుకొనే లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించగా,తెలంగాణా సర్కార్ కూడా లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు