తెలంగాణ ప్రజలది విలక్షణ తీర్పు..: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లోని గాంధీభవన్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో విజయంపై మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారని తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతా చారికి ఘన నివాళి ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారన్న ఆయన రాష్ట్రంలో అమరవీరులకు ఈ విజయం అంకితమని తెలిపారు.

Telangana People Have A Unique Judgment..: Revanth Reddy-తెలంగాణ �

తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి ప్రజలు తమకు అవకాశం కల్పించారన్నారు.ఇకపై ప్రగతిభవన్ ను ప్రజాభవన్ గా మారుస్తామన్నారు.

ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలుస్తుందని చెప్పారు.అన్ని వర్గాలు స్వేచ్ఛగా తమ హక్కులను వినియోగించుకోవడానికి కాంగ్రెస్ ఆలంబనగా ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు