తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

టీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీఆర్ఎస్, బీజేపీలు రెండు వీధి నాటకాలు ఆడుతున్నాయన్నారు.

కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని చెప్పారు.లిక్కర్ స్కామ్ లో మిగతా వారిని ఢిల్లీలో విచారించారని తెలిపారు.

కవితను విచారించేందుకు మాత్రం అనుమతి కోరుతున్నారన్నారు.నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములు, ఇతర కేసులపై విచారణ చేపట్టాలని కోరారు.

గతంలో ఈసీకి తాను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదన్నారు.తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?

తాజా వార్తలు