ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

జగన్ ఆస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలో హరిరామజోగయ్య పిటిషన్ ను పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ అభ్యంతరాలు తెలపగా హైకోర్టులో దీనిపై వాదనలు కొనసాగాయి.ఈ నేపథ్యంలోనే పిల్ లో సవరణలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు పిల్ కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం ప్రతివాదులు జగన్, సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.అయితే సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటిషన్ లో కోరిన సంగతి తెలిసిందే.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!
Advertisement

తాజా వార్తలు