శ్రీశైలం మల్లన్న సన్నిధిలో తెలంగాణ గవర్నర్ తమిళసై సుందరరాజన్

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసై సుందరరాజన్ ఆలయ రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలను అనుసరించి మంగళవాయిద్యాలతో అర్చకులు,వేదపండితులు ఆలయ ఈవో లవన్న సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం గవర్నర్ తమిళసై సుందరరాజన్ శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు,వేదపండితుల నుండి ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో లవన్న జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు స్వామి అమ్మవారి శేషవస్త్రాలు,తీర్థప్రసాదాలు,స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు శ్రీశైలంలో తెలంగాణ గవర్నర్ పర్యటనలో జిల్లా కలెక్టర్ పి.

కోటేశ్వరరావు,ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

దర్శనంతరం ఆలయ బయట మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాజ్ భవన్ తరుపున నాగర్ కర్నూలు జిల్లాలో 6 చెంచు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నామని 6 గ్రామాలకు సంబంధించి అభివృద్ధికి 50 లక్షల రూపాయలను నిధులను కేటాయించమన్నారు 6 గ్రామాలలో విద్య, వైద్యం, వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు శ్రీశైల మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అలానే కరోన నుండి ప్రపంచ,దేశ,రాష్ట్ర ప్రజలు బయటపడలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామి అమ్మవారిని కోరుకున్నానని తెలంగాణ గవర్నర్ తమిలిసై సుందరరాజన్ అన్నారు.

బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

తాజా వార్తలు