తెలంగాణ ఎక్స్‎ప్రెస్‎కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ ఎక్స్‎ప్రెస్‎కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.మహారాష్ట్రలో ప్రయాణిస్తున్న సమయంలో రైలులో అగ్నిప్రమాదం జరిగింది.

ఉదయం ఎక్స్‎ప్రెస్‎లోని ఎస్-2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మంటలను గమనించి వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఎక్స్‎ప్రెస్‎ ట్రైన్ ను నాగ్ పూర్ సమీపంలో నిలిపివేశారు.దీంతో వెంటనే ప్రయాణికులు బోగి దిగి బయటకు పరుగులు పెట్టారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

Advertisement

కాగా ఎస్-2 బోగీలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు