ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగారు.వరదలతో పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు.మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరికొందరు రాష్ట్ర గవర్నర్ ను కలిసిన సంగతి తెలిసిందే.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో నేతలు రాజ్ భవన్ కు వెళ్లారు.ఈ మేరకు రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నెలకొన్న సమస్యలను, రైతులకు వాటిల్లిన నష్టాన్ని వివరించారు.

అనంతరం గవర్నర్ స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరిన సంగతి తెలిసిందే.

Advertisement
వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?