రాజ్‎భవన్‎లో తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం..!!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరనుంది.ఇవాళే సీఎం, ఒకరిద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణ రాజ్ భవన్ లోనే ప్రమాణస్వీకారం కార్యక్రమం జరిగే ఛాన్స్ ఉంది.ఈ మేరకు ఇప్పటికే రాజ్ భవన్ లో సౌకర్యాల గురించి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆరా తీసిందని తెలుస్తోంది.

మరోవైపు సీఎల్పీ నేత ఎంపిక కోసం ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ జరుగుతోంది.ఎంపిక ప్రక్రియ పూర్తి కాగానే నివేదికను ఏఐసీసీ పరిశీలకులు పార్టీ హైకమాండ్ కు పంపనున్నారు.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తదుపరి కార్యక్రమం ఉండనుంది.అలాగే ఈనెల 9న మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుందని సమాచారం.

Advertisement
మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు